సిద్ధరామయ్యకు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
అధికారం చేపట్టి ఆరు నెలలు గడవకముందే తీవ్ర వ్యతిరేకత మూటగట్టుకున్న ప్రభుత్వం మీదంటూ సిద్ధరామయ్యకు చురకలు అంటించారు కేటీఆర్.
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కామారెడ్డి సభలో చేసిన కామెంట్స్‌కు కౌంటర్ ఇచ్చారు మంత్రి కేటీఆర్. కర్ణాటక, తెలంగాణను పోలుస్తూ సిద్ధరామయ్యపై సెటైర్లు వేశారు. కర్ణాటకలో మీది 5 గంటల ఫెయిల్యూర్ మోడల్ అని.. తెలంగాణలో మాది 24 గంటల పవర్‌ఫుల్ మోడల్ అంటూ ట్వీట్ చేశారు. పదేళ్ల ప్రస్థానం తర్వాత కూడా ఆదిలాబాద్ నుంచి అలంపూర్ వరకు ప్రజాభిమానం వెల్లువెత్తుతున్న పాలన మాది అంటూ కేటీఆర్ చెప్పుకొచ్చారు.
అధికారం చేపట్టి ఆరు నెలలు గడవకముందే తీవ్ర వ్యతిరేకత మూటగట్టుకున్న ప్రభుత్వం మీదంటూ సిద్ధరామయ్యకు చురకలు అంటించారు కేటీఆర్. ఎన్నికల్లో మీరు ఇచ్చిన ఐదు హామీలకు పాతరేసి నమ్మి ఓటేసిన ప్రజలను పూర్తిగా గాలికొదిలేసి.. ఇక్కడికొచ్చి అబద్ధాలు ప్రచారం చేస్తే నమ్మడానికి ఇది అమాయక కర్ణాటక కాదు.. తెలివైన తెలంగాణ అంటూ రాసుకొచ్చారు కేటీఆర్. రైతులకు 5 గంటలు కూడా కరెంట్ ఇవ్వలేని మీరు.. మీ ప్రజలకిచ్చిన ఐదు హామీల్ని ఐదేళ్లయినా అమలు చేయలేరంటూ ఎద్దేవా చేశారు.
సిద్ధరామయ్య గారు..
— KTR (@KTRBRS) November 10, 2023
కర్ణాటకలో మీది “5 గంటల.. ఫెయిల్యూర్ మోడల్”
తెలంగాణలో మాది “24 గంటల.. పవర్ - ఫుల్ మోడల్”
పదేళ్ల ప్రస్థానం తరువాత కూడా..
ఆదిలాబాద్ నుంచి అలంపూర్ వరకు..
ప్రజాభిమానం వెల్లువెత్తుతున్న పాలన మాది
అధికారం చేపట్టి ఆరు నెలలు గడవకముందే...
తీవ్ర వ్యతిరేకత…
మీ రాష్ట్రంలో కనీసం రేషన్ ఇవ్వలేరు కానీ ఇక్కడికొచ్చి డిక్లరేషన్లు ప్రకటిస్తే నమ్మడానికి ఎవరు సిద్ధంగా లేరని విమర్శించారు కేటీఆర్. 75 ఏళ్ల స్వతంత్ర భారతంలో బీసీలు ఇంకా వెనుకబడి ఉన్నారంటే ఆ పాపం కాంగ్రెస్ పార్టీదేనన్నారు. ఇప్పుడు కర్ణాటకలో మళ్లీ ఎన్నికలు జరిగితే వైఫల్యాల కాంగ్రెస్‌ను ఇంటికి సాగనంపేందుకు అక్కడి ప్రజలు సిద్ధంగా ఉన్నారని.. నమ్మించి మోసం చేసినందుకు మీకు సరైన గుణపాఠం తథ్యమంటూ సిద్ధరామయ్యకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు కేటీఆర్.