Telugu Global
Telangana

ఇదే తెలంగాణ మోడల్.. కేటీఆర్ ఆసక్తికర ట్వీట్

తెలంగాణలో బీఆర్ఎస్ సాధించిన అభివృద్ధి సుస్థిరం అని, దాన్ని చెరిపేయాలనుకోవడం, ఆ క్రెడిట్ కేసీఆర్ కి దక్కకుండా చేయాలనుకోవడం కాంగ్రెస్ కి సాధ్యం కాదంటున్నారు బీఆర్ఎస్ నేతలు.

ఇదే తెలంగాణ మోడల్.. కేటీఆర్ ఆసక్తికర ట్వీట్
X

తెలంగాణ మోడల్ అంటే ఇదేనంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆసక్తికర ట్వీట్ వేశారు. ప్రఖ్యాత మేగజీన్ 'ది ఎకనమిస్ట్' కథనాన్ని ఆయన తన ట్వీట్ లో ప్రస్తావించారు. ఇలాంటి కథనాలు చూసయినా వాస్తవాలు తెలుసుకోవాలని, పదేళ్ల తెలంగాణ ప్రగతి ప్రస్థానంపై బురదచల్లడం మానుకొని, అభివృద్ధిని కొనసాగించాలని ఆయన కాంగ్రెస్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ, దేశానికే ఒక అభివృద్ధి మోడల్‌గా తయారైందని చెప్పారు కేటీఆర్. ఇతర రాష్ట్రాలకు సక్సెస్ పాఠంగా మిగిలిందన్నారు.


తెలంగాణ ప్రభుత్వం సాధించిన విజయాలను మరోసారి గుర్తు చేశారు కేటీఆర్. కొత్త రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడేనాటికి స్థాపిత విద్యుత్ సామర్థ్యం 7.8 గిగావాట్లుగా ఉంటే.. బీఆర్ఎస్ పాలనలో అది 19.3 గిగావాట్లకు పెరిగిందని చెప్పారు కేటీఆర్. ఐటీ ఎగుమతులు 2014 నుంచి 2023 వరకు 9 ఏళ్లలో నాలుగు రెట్లు పెరిగాయన్నారు. తెలంగాణ ఐటీ దిగుమతులు, ఐటీ ఉద్యోగాల్లో భారీ పురోగతి ఉందన్నారు. ఐటీ ఉద్యోగాలు దాదాపు మూడు రెట్లు పెరిగి 9లక్షలకు చేరుకున్నాయని చెప్పారు. జీడీపీ గ్రోత్ 4.1 శాతం నుంచి 4.9 శాతానికి మారిందన్నారు కేటీఆర్.

తెలంగాణలో బీఆర్ఎస్ సాధించిన అభివృద్ధి సుస్థిరం అని, దాన్ని చెరిపేయాలనుకోవడం, ఆ క్రెడిట్ కేసీఆర్ కి దక్కకుండా చేయాలనుకోవడం కాంగ్రెస్ కి సాధ్యం కాదంటున్నారు బీఆర్ఎస్ నేతలు. తెలంగాణ, హైదరాబాద్ అభివృద్ధిని ప్రపంచమంతా గుర్తించిందని, వీలయితే ఆ అభివృద్ధిని కొనసాగించాలని కాంగ్రెస్ ప్రభుత్వానికి హితవు పలుకుతున్నారు. అంతేకానీ, గత ప్రభుత్వంపై నిందలు వేయాలనుకోవడం, అప్రతిష్టపాలు చేయాలనుకోవడం తగదని హెచ్చరిస్తున్నారు.

First Published:  21 Jun 2024 11:03 AM GMT
Next Story