ఉబర్ బోర్డ్ రూమ్‌లో మంత్రి కేటీఆర్.. ఎంప్లాయిస్‌తో చిట్ చాట్
ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంపొందించడం, అందులో ఎదురవుతున్న అడ్డంకులు తొలగించడంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక పాత్ర పోషిస్తోందని మంత్రి కేటీఆర్ తెలిపారు.
ప్రముఖ క్యాబ్ అగ్రిగేటర్ ఉబర్ ఇండియా బోర్డ్ రూమ్‌కు తెలంగాణ మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ వెళ్లారు. ఉబర్ సౌత్ ఏషియా ప్రెసిడెంట్ ప్రబ్జిత్ సింగ్, వోల్వో ఇండియా ప్రెసిడెంట్ కమల్ బాలి, బౌన్స్ ఇన్ఫినిటీ సీఈవో హాలేకర్, తెలంగాణ ఐటీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్‌తో పాటు కీలక ఉద్యోగులు చర్చలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. దేశంలోనే క్లీన్ ఎనర్జీ హబ్‌గా తెలంగాణ ఆవిర్భవించిందని అన్నారు. ఎలక్ట్రిక్ మొబిలిటీని విజయవంతం చేసేందుకు ప్రభుత్వం, పరిశ్రమల మధ్య బహుళ స్థాయి సహకారం అవసరం అని కోరారు.
ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంపొందించడం, అందులో ఎదురవుతున్న అడ్డంకులు తొలగించడంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక పాత్ర పోషిస్తోందని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఈవీ రంగ వృద్ధికి పన్ను మినహాయింపులతో పాటు క్యాపిటల్ ఇన్సెంటివ్స్, సబ్సిడీ వంటి ప్రోత్సాహకాలను అందిస్తున్నామని పేర్కొన్నారు. మొబిలిటీ రంగలో ఉన్న సంస్థలకు ఎదురవుతున్న సవాళ్లను పరిష్కారించేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పని చేయడానికి ఉబర్ చొరవ చూపడం హర్షణీయం అన్నారు.
కాగా, 2040 నాటికి జీరో ఎమిషన్ ప్లాట్‌ఫామ్ వేదికగా ఎదిగేందుకు తమ సంస్థ కట్టుబడి ఉన్నట్లు ఉబర్ ఇండియా, సౌత్ ఏషియా ప్రెసిడెంట్ ప్రబ్జిత్ సింగ్ తెలిపారు. అనంతరం ఉబర్ ఎంప్లాయిస్‌తో కేటీఆర్ కాసేపు చిట్ చాట్ చేశారు. వాళ్లు అడిగిన ప్రశ్నలకు చాలా కూల్‌గా ఆన్సర్స్ ఇచ్చారు. కేటీఆర్ తమ ఆఫీస్‌కు వచ్చి ఉద్యోగులతో మాట్లాడటం చాలా గౌరవంగా భావిస్తున్నట్లు ఉబర్ ఇండియా ట్విట్టర్‌లో పేర్కొన్నది. హైదరాబాద్‌లో స్థిరమైన రవాణా ఏర్పాటు చేయడానికి, భవిష్యత్ గురించి ముందుగానే అంచనా వేసిన ఆయన ఆలోచనలు ఒక బుక్ లాగా మా ఉద్యోగులకు ఉపయోగపడతాయని పేర్కొంది. ఉద్యోగులతో చేసిన చిట్ చాట్ ఒక ఫైర్ రౌండ్ లాగా ఉందని తెలిపింది.
సోమవారం హైటెక్స్‌లో నిర్వహించిన ఈ-మొబిలిటీ సెమినార్‌లో టీఎస్ఈవీ యాప్‌ను రెడ్కో చైర్మన్ సతీశ్ రెడ్డి ఆధ్వర్యంలో మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు. తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్‌లో ఈవీ చార్జింగ్ కేంద్రాలు ఎక్కడ ఉన్నాయి? దగ్గరలో ఉన్న చార్జింగ్ కేంద్రం ఎంత దూరంలో ఉన్నది? అక్కడ ఎంత రుసుం చెల్లించాలనే వివరాలు సదరు యాప్ ద్వారా తెలుసుకోవచ్చు. గ్రేటర్ పరిధిలో ఏర్పాటైన 150 ఈవీ చార్జింగ్ కేంద్రాల సమాచారాన్ని అంతా అందులో నిక్షిప్తం చేశారు.
We had the honour to host Hon. Minister @KTRBRS at our office in Hyderabad. His fireside chat with Uber employees was one for the books where he delved into sustainable and future forward transportation in Hyderabad. pic.twitter.com/nB6w4fScD3
— Uber India (@Uber_India) February 6, 2023
Minister KTR attended the e-mobility boardroom hosted by India Global Forum @IGFupdates and @Uber_India at Uber’s Hyderabad tech center.
— Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) February 6, 2023
During his address, @KTRBRS emphasized the need for collaboration between government & industry to accelerate Electric Mobility in India. pic.twitter.com/dsWVHdvUAm