పరిణితి లేని మూర్ఖుడు.. రేవంత్ పై కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు
తెలంగాణ ఆవిర్భావ సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి కనీసం ఒక్కసారి కూడా జై తెలంగాణ అనలేదని, అది ఆయన తెలివి తక్కువ తనానికి నిదర్శనం అన్నారు కేటీఆర్.
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేళ సీఎం రేవంత్ రెడ్డిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఆయన పరిణితి, పరిపక్వత లేని మూర్ఖుడంటూ తీవ్రంగా విమర్శించారు. తెలంగాణ దశాబ్ది వేడుకలను కేవలం ఒకరోజుకే పరిమితం చేయడాన్ని కేటీఆర్ తప్పుబట్టారు. గతేడాది తాము నెలరోజులపాటు ఉత్సవాలు నిర్వహించామని గుర్తు చేశారు. తెలంగాణ ఆవిర్భవించి దశాబ్ది పూర్తయిన సందర్భంగా ఈ ఏడాది కేవలం ఒక్కరోజు మాత్రమే ఉత్సవాలు నిర్వహించడం చూస్తే రేవంత్ రెడ్డికి పరిపక్వత లేదని అర్థమవుతోందన్నారు.
Live: BRS Working President @KTRBRS hoisting the National Flag on the occasion of #TelanganaFormationDay at Telangana Bhavan. https://t.co/OJuzO3Lb1Y
— BRS Party (@BRSparty) June 2, 2024
జై తెలంగాణ అనలేదేం..
తెలంగాణ ఆవిర్భావ సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి కనీసం ఒక్కసారి కూడా జై తెలంగాణ అనలేదని, అది ఆయన తెలివి తక్కువ తనానికి నిదర్శనం అన్నారు కేటీఆర్. రేవంత్ రెడ్డి జాక్ పాట్ ముఖ్యమంత్రి అని ఎద్దేవా చేశారు. తెలంగాణ త్యాగాల గురించి మాట్లాడే అర్హత, కేసీఆర్ గురించి మాట్లాడే అర్హత రేవంత్ రెడ్డికి లేదన్నారు. కచ్చితంగా ఆయనకు బుద్ధి చెప్పే రోజులు వస్తాయన్నారు. తెలంగాణ భవన్ లో జరిగిన రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవంలో పాల్గొన్న కేటీఆర్ జాతీయ జెండా ఎగురవేశారు.
తెలంగాణ ఏర్పాటుకి సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు కేటీఆర్. రాష్ట్ర ఏర్పాటుకోసం ప్రాణాలు త్యాగం చేసిన వారిని స్మరించుకున్నారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ ఎంతో అభివృద్ధి సాధించిందని, ప్రతి రంగంలో తన ఉనికి నిరూపించుకుందన్నారు కేటీఆర్.