Telugu Global
Telangana

సుంకిశాల ఘటనకు బాధ్యుడు రేవంత్ రెడ్డే - కేటీఆర్

గత దశాబ్ధ కాలంలో హైదరాబాద్ చాలా విస్తరించిందని, తాగునీటి అవసరాలు తీర్చేందుకు సుంకిశాల ప్రాజెక్టు ప్లాన్ చేశామన్నారు. సాగునీటికి రైతులకు డోకా లేదన్న విశ్వాసం వచ్చిన తర్వాతే సుంకిశాల పనులను ప్రారంభించామన్నారు.

సుంకిశాల ఘటనకు బాధ్యుడు రేవంత్ రెడ్డే - కేటీఆర్
X

హైదరాబాద్‌ మహానగర నీటి అవసరాలు తీర్చేందుకు నాగార్జున సాగర్ సమీపంలో నిర్మిస్తున్న సుంకిశాల ప్రాజెక్టు గోడ కూలిపోవడంపై స్పందించారు మాజీ మంత్రి కేటీఆర్. హైదరాబాద్ నగర ప్రజలకు ఇదో విషాద వార్త అని చెప్పుకొచ్చారు. ఆగస్టు 2 ఉదయం 6 గంటలకు ఘటన జరిగితే విషయాన్ని దాచిపెట్టారా..? లేదా ప్రభుత్వానికి సమాచారం లేదా..? అని ప్రశ్నించారు కేటీఆర్. ప్రభుత్వానికి తెలియకపోతే అంతకన్నా సిగ్గుచేటు మరొకటి ఉండదన్నారు. హడావుడిగా పనులు చేయడం వల్లే ప్రమాదం జరిగిందన్నారు.


మున్సిపల్ శాఖ తన దగ్గరే పెట్టుకున్న సీఎం రేవంత్ రెడ్డే ఈ ఘటనకు బాధ్యత వహించాలన్నారు కేటీఆర్. మేడిగడ్డలో ఏం జరిగినా కేంద్రం స్పందిస్తుందని చెప్పే బీజేపీ ఇప్పుడు ఏం చెప్తుందన్నారు. ఎన్నికలున్నప్పటికీ.. మేడిగడ్డ ఘటనను తాము దాచలేదన్నారు. ప్రభుత్వ నిర్వహణ లోపం వల్లే సుంకిశాల ప్రమాదం జరిగిందన్నారు కేటీఆర్. మున్సిపల్ శాఖలో పాలన పడకేసిందన్నారు కేటీఆర్.

గత దశాబ్ధ కాలంలో హైదరాబాద్ చాలా విస్తరించిందని, తాగునీటి అవసరాలు తీర్చేందుకు సుంకిశాల ప్రాజెక్టు ప్లాన్ చేశామన్నారు. సాగునీటికి రైతులకు డోకా లేదన్న విశ్వాసం వచ్చిన తర్వాతే సుంకిశాల పనులను ప్రారంభించామన్నారు. నాగార్జున సాగర్‌లో డెడ్‌ స్టోరేజ్‌ (462 అడుగుల) దగ్గర నీరు ఉన్నా ఎత్తిపోసుకునే అవకాశం ఉంటుందన్నారు. రాబోయే 50 ఏళ్ల పాటు హైదరాబాద్‌కు నీటి సమస్య రాకుండా ప్రణాళికలు రూపొందించామన్నారు. సీతరామ ప్రాజెక్టు పూర్తి చేసింది కేసీఆర్ ప్రభుత్వమేనన్న కేటీఆర్.. ఎన్నికల కోడ్ ఉండడం వల్లే ప్రారంభించలేకపోయామన్నారు. నెత్తి మీద నీళ్లు చల్లుకుని భట్టి, తుమ్మల యాక్టింగ్ చేస్తున్నారని సెటైర్లు వేశారు కేటీఆర్.

First Published:  9 Aug 2024 8:48 AM GMT
Next Story