Telugu Global
Telangana

నాగంకి బీఆర్ఎస్ వెల్ కమ్.. చేరిక ఎప్పుడంటే..?

నాగంను మంత్రులు కేటీఆర్, హరీష్ రావు కలిశారు. ఆయన్ను బీఆర్ఎస్ లోకి ఆహ్వానించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన నాగం.. కార్యకర్తల కోరిక మేరకు తాను బీఆర్ఎస్ లో చేరుతున్నట్టు ప్రకటించారు.

నాగంకి బీఆర్ఎస్ వెల్ కమ్.. చేరిక ఎప్పుడంటే..?
X

కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి.. త్వరలో బీఆర్ఎస్ లో చేరుతానని ప్రకటించారు. సీఎం కేసీఆర్ తో సమావేశమైన తర్వాత తన చేరిక ముహూర్తం ప్రకటిస్తానన్నారు. కాంగ్రెస్ లో జరుగుతున్న పరిణామాలతో తీవ్రంగా కలత చెందినట్టు తెలిపారు నాగం. తనని కలిసేందుకు వచ్చిన మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ లకు ఆయన సాదర స్వాగతం పలికారు. బీఆర్ఎస్ లో చేరేందుకు సుముఖత వ్యక్తం చేశారు.

కాంగ్రెస్ సెకండ్ లిస్ట్ ప్రకటన తర్వాత నాగం జనార్దన్ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. నాగర్ కర్నూల్ స్థానానికి కూచుకుళ్లను అభ్యర్థిగా కాంగ్రెస్ ప్రకటించడంతో నాగం అలిగారు. కాంగ్రెస్ కి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ఆ తర్వాత పరిణామాలు చకచకా జరిగిపోయాయి. నాగంను మంత్రులు కేటీఆర్, హరీష్ రావు కలిశారు. ఆయన్ను బీఆర్ఎస్ లోకి ఆహ్వానించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన నాగం.. కార్యకర్తల కోరిక మేరకు తాను బీఆర్ఎస్ లో చేరుతున్నట్టు ప్రకటించారు.

బీఆర్ఎస్ అభ్యర్థితో కలసి పనిచేస్తా..

ప్రస్తుతం నాగర్ కర్నూల్ లో బీఆర్ఎస్ తరపున సిట్టింగ్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి పోటీ చేయబోతున్నారు. అదే స్థానాన్ని ఆశించిన నాగం ఇప్పుడు బీఆర్ఎస్ లోకి వస్తున్నారు. అయితే తమ మధ్య పోటీ లేదని, తాను మర్రి జనార్దన్ రెడ్డి తో కలసి పని చేస్తానన్నారు నాగం. మర్రి కూడా నాగంతో కలిసి పని చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. నాగం జనార్దన్‌రెడ్డికి తాను కుమారుడి లాంటివాడనన్నారు మర్రి.

First Published:  29 Oct 2023 8:18 PM IST
Next Story