Telugu Global
Telangana

డెలివరీ బాయ్స్‌ కోసం కేటీఆర్‌..స్విగ్గీకి స్పెషల్ రిక్వెస్ట్‌

డెలివరీ బాయ్స్‌కు హెల్త్‌ బెనిఫిట్స్‌తో పాటు ఇన్సూరెన్స్‌, సోషల్‌ సెక్యూరిటీ లాంటివి కల్పించాలని స్విగ్గీతో పాటు ఇతర డెలివరీ సంస్థలకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ట్వీట్‌ చేశారు కేటీఆర్.

డెలివరీ బాయ్స్‌ కోసం కేటీఆర్‌..స్విగ్గీకి స్పెషల్ రిక్వెస్ట్‌
X

డెలివరీ బాయ్స్‌ కోసం స్విగ్గీకి ప్రత్యేక విజ్ఞప్తి చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. డెలివరీ బాయ్స్‌కు హెల్త్‌ బెనిఫిట్స్‌తో పాటు ఇన్సూరెన్స్‌, సోషల్‌ సెక్యూరిటీ లాంటివి కల్పించాలని స్విగ్గీతో పాటు ఇతర డెలివరీ సంస్థలకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ట్వీట్‌ చేశారు కేటీఆర్. దేశంలో గిగ్‌ వర్కర్ పరిశ్రమ వేగంగా వృద్ధి చెందుతున్న నగరాల్లో హైదరాబాద్ ఒకటని గుర్తు చేశారు కేటీఆర్. హైదరాబాద్‌లో ప్రతి నెల 45 శాతం వ్యాపారం పెరుగుతోందన్నారు. ఇతరులకు సాయం చేస్తూ మనం ఎదగాలని కోరారు.



ఇక స్విగ్గీ సీఈవో శ్రీహర్ష మాజెటిపై ప్రశంసలు కురిపించారు కేటీఆర్. గడిచిన పదేళ్ల కాలంలో ఫుడ్ డెలివరీ ఇండస్ట్రీలో స్విగ్గీ బలీయమైన శక్తిగా మారిన విధానం స్ఫూర్తిదాయకమన్నారు కేటీఆర్. నిజంగా ఇది ఒక అద్భుత విజయమంటూ అభినందనలు తెలిపారు. చిన్నతనంలో కుటుంబంలో ఏదైనా వస్తువు తీసుకురావాలంటే తాము డెలివరీ బాయ్స్‌గా వ్యవహరించే వాళ్లమని గుర్తు చేసుకున్నారు కేటీఆర్. కానీ భవిష్యత్తులో ఇది ఒక పరిశ్రమలా మారుతుందని ఎవరూ ఊహించి ఉండరన్నారు కేటీఆర్.

అసెంబ్లీ ఎన్నికలకు ముందు గిగ్‌వర్కర్స్‌తో కేటీఆర్ సమావేశమైన విషయం తెలిసిందే. అధికారంలోకి వస్తే జాబ్ సెక్యూరిటీ, హెల్త్ ఇన్సూరెన్స్‌, ఫిక్స్‌డ్‌ శాలరీ వంటి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని వారికి హామీ ఇచ్చారు. ఇక కాంగ్రెస్‌ సైతం గిగ్‌ వర్కర్స్‌కు హెల్త్ ఇన్సూరెన్స్‌ లాంటి హామీలు ఇచ్చింది.

First Published:  29 Aug 2024 3:29 PM IST
Next Story