Telugu Global
Telangana

రాష్ట్రంలో ఎక్క‌డ వేసిన గొంగ‌డి అక్క‌డే..కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ ఫైర్

ఇందిరమ్మ రాజ్యంలో మింగ మెతుకు లేదు.. కానీ మీసాల‌కు మాత్రం సంపెంగ నూనె కావాల‌ట అని సీఎం రేవంత్‌పై కేటీఆర్ మండిపడ్డారు

రాష్ట్రంలో ఎక్క‌డ వేసిన గొంగ‌డి అక్క‌డే..కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ ఫైర్
X

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి పది నెలలు అవుతున్న ఒక్క అభివృద్ధి ప‌థ‌కం అమలుకు కాలేదని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా తెలిపారు. మింగ మెతుకు లేదు.. కానీ మీసాలకు మాత్రం సంపెంగ నూనె కావాలె అన్నట్టునది కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరి ఉందని అని కేటీఆర్ విమ‌ర్శించారు. తెల్లారి లేస్తే బీద అరుపులు. రాష్ట్రం అప్పులపాలైంది అని, డబ్బులు లేవని. మరొకవైపు మూసీ పేరిట ఈ లక్ష యాభై వేల కోట్ల సోకులు, ఆర్భాటం ఎవరికోసం? అని కేటీఆర్ ప్ర‌శ్నించారు.

ఈ సంద‌ర్భంగా రేవంత్ ఎన్నిక‌ల స‌మ‌యంలో ఇచ్చిన హామీల‌ను కేటీఆర్ మ‌రోసారి గుర్తు చేశారు. ఇందిరమ్మ రాజ్యంలో ఒక్క సంక్షేమ‌, అభివృద్ధి ప‌థ‌కం అమ‌లుకు నోచుకోలేదని రాష్ట్రంలో ఎక్క‌డ వేసిన గొంగ‌డి అక్క‌డే అన్న చందంగా త‌యారైంది. ఏ ఒక్క వ‌ర్గానికి కూడా ఇప్ప‌టి వ‌ర‌కు ఒక్క సంక్షేమ ప‌థ‌కం అంద‌లేదు. ఈ క్ర‌మంలో రేవంత్ ప్రభుత్వంపై తెలంగాణ ప్రజలు తీవ్ర ఆగ్ర‌హంతో ఉన్నారని పేర్కొన్నారు.

First Published:  7 Oct 2024 8:49 AM GMT
Next Story