కేటీఆర్ వీడియోని ఎడిట్ చేసి వైరల్ చేస్తున్న కాంగ్రెస్
ఆ పోస్ట్ ని కాంగ్రెస్ డిలీట్ చేయలేదు, అలాగని దాన్ని సమర్థించుకునే అవకాశమూ లేదు. సరిగ్గా ఎన్నికల వేళ ఈ వీడియోతో కాంగ్రెస్ తన పరువు తానే తీసుకుందని అంటున్నారు బీఆర్ఎస్ నేతలు.
"కేసీఆర్ ని ఓడించడమే నా జీవిత లక్ష్యం, అందుకే నేను తప్పుకుంటున్నా, కాంగ్రెస్ కే గుద్దండి అందరూ కలసి.." అంటూ కేటీఆర్ అన్నట్టుగా ఉన్న ఓ వీడియో ఈరోజు తెలంగాణ కాంగ్రెస్ ట్విట్టర్ అకౌంట్ లో ప్రత్యక్షమైంది. సరిగ్గా పోలింగ్ మొదలైన కాసేపటికి ఈ వీడియోని అప్ లోడ్ చేశారు. ఉద్దేశపూర్వకంగానే ఈ ఫేక్ వీడియోతో కేటీఆర్ ని టార్గెట్ చేయాలని చూశారు కాంగ్రెస్ నేతలు. కానీ అంతలోనే వారికి కౌంటర్ పడింది. అసలు వీడియోని బీఆర్ఎస్ తెరపైకి తెచ్చింది. కేటీఆర్ పూర్తి ప్రసంగాన్ని బీఆర్ఎస్ అధికారిక ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ చేసింది. ఇలాంటి చీప్ ట్రిక్స్ తో తెలంగాణ ప్రజల ముందు కాంగ్రెస్ మరింత చీప్ గా మారిపోయిందని బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. బీఆర్ఎస్ ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ గ్రూప్ తో కలసిన తర్వాత వైఎస్ షర్మిల చెప్పిన మాటల్ని కేటీఆర్ ఆ వీడియోలో ప్రస్తావించారు. ఆ ప్రస్తావనలో కొంత భాగాన్ని హైలైట్ చేస్తూ వీడియోని ఎడిట్ చేసి కాంగ్రెస్ అధికారిక అకౌంట్ లో పోస్ట్ చేశారు.
"FAKE.. FAKE... Deep Fake"
— BRS Party (@BRSparty) November 30, 2023
ఓటమి ఖాయం కావడంతో కాంగ్రెస్ పార్టీ చిల్లరగాళ్ళు పోలింగ్ నాడు మరో ఫేక్ వీడియో ప్రచారం మొదలుపెట్టారు.
ఒరేయ్.. చిన్న పిల్లాడు కూడా ఆ వీడియోను చూసిన వెంటనే ఫేక్ అని చెప్పేస్తాడు.
డిసెంబర్ మూడవ తారీకు దాకా అగాల్సిన పనిలేదు. వందేళ్లకు పైబడి చరిత్ర ఉన్న మీ… https://t.co/OjiDOuD2dk pic.twitter.com/psOB2XSVNu
బీఆర్ఎస్ ఖండన..
ఓటమి ఖాయం కావడంతో కాంగ్రెస్ పార్టీ చిల్లరగాళ్ళు పోలింగ్ నాడు మరో ఫేక్ వీడియో ప్రచారం మొదలుపెట్టారంటూ బీఆర్ఎస్ ట్విట్టర్ హ్యాండిల్ లో ఘాటుగా రిప్లై పెట్టారు.
"ఒరేయ్.. చిన్న పిల్లాడు కూడా ఆ వీడియోను చూసిన వెంటనే ఫేక్ అని చెప్పేస్తాడు.
డిసెంబర్ మూడో తేదీ వరకు అగాల్సిన పనిలేదు. వందేళ్లకు పైబడి చరిత్ర ఉన్న మీ దిక్కుమాలిన కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ అకౌంట్ పై ఈ చిల్లర డీప్ ఫేక్ వీడియో వేసినప్పుడే మీ ఓటమి ఖాయం అయ్యింది.
మీది ఎంత దౌర్భాగ్యపు పార్టీనో తెలంగాణ ప్రజలకు అర్థం అయ్యింది.
మీకు చైతన్య వంతులైన తెలంగాణ ఓటర్లు ఓటుతోనే బుద్ధి చెబుతారు.
మీరు ఎంత గింజుకున్నా కేసీఆర్ విజయాన్ని ఆపలేరు." అంటూ ట్వీట్ వేశారు.
వాస్తవానికి ఇలాంటి ఫేక్ వీడియోలు, సగం సగం ఎడిటింగ్ చేసిన వీడియోలను అధికారిక ఖాతాల్లో ఎవరూ పోస్ట్ చేయరు. కానీ కాంగ్రెస్ ఎందుకో ఆ రిస్క్ చేసింది. కేటీఆర్ వీడియోని ఎడిటింగ్ చేసి ప్రజలకు తప్పుడు మెసేజ్ పంపించాలనే ప్రయత్నం చేసింది. అయితే పూర్తి వీడియోతో బీఆర్ఎస్ కౌంటర్ అటాక్ చేయడంతో కాంగ్రెస్ కి ఏం చేయాలో తోచడంలేదు. ఆ పోస్ట్ ని డిలీట్ చేయలేదు, అలాగని దాన్ని సమర్థించుకునే అవకాశమూ లేదు. సరిగ్గా ఎన్నికల వేళ ఈ వీడియోతో కాంగ్రెస్ తన పరువు తానే తీసుకుందని అంటున్నారు బీఆర్ఎస్ నేతలు.