Telugu Global
Telangana

ఢిల్లీలో దీక్షకు కేటీఆర్ ప్రపోజల్‌.. రేవంత్ ఏమన్నారంటే!

కాంగ్రెస్ ఢిల్లీలో దీక్ష చేస్తే బీఆర్ఎస్ తరపున వెయ్యి మందిని తీసుకోస్తామన్నారు. అంద‌రం క‌లిసి రాష్ట్రానికి నిధుల విషయంలో కేంద్రంతో తేల్చుకుందామన్నారు.

ఢిల్లీలో దీక్షకు కేటీఆర్ ప్రపోజల్‌.. రేవంత్ ఏమన్నారంటే!
X

కేంద్ర బడ్జెట్ కేటాయింపుల్లో రాష్ట్రానికి జ‌రిగిన అన్యాయంపై తెలంగాణ అసెంబ్లీలో హాట్‌ హాట్‌గా చర్చ జరిగింది. ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మధ్య మాటల యుద్ధం నడిచింది. తెలంగాణకు కేంద్ర నిధుల కోసం ఢిల్లీలో దీక్షపై ఇద్దరు నేతల మధ్య డైలాగ్‌ వార్ నడిచింది.

తెలంగాణ రాష్ట్రానికి నిధుల కోసం సీం రేవంత్ రెడ్డి ఢిల్లీలో దీక్ష చేయాలన్నారు కేటీఆర్. మంత్రి వర్గంతో సీఎం రేవంత్ రెడ్డి ఆమరణ దీక్షకు కూర్చోవాలన్నారు. దీక్షకు బీఆర్ఎస్ అండగా ఉంటుందన్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరం కలిసి దీక్షకు కూర్చుందామన్నారు కేటీఆర్. ఇటీవల రుణమాఫీ కోసం హరీష్ రావును, నిరుద్యోగుల కోసం తనను ఆమరణ దీక్ష చేయాలని రేవంత్ కోరారని గుర్తుచేశారు కేటీఆర్. కాంగ్రెస్ ఢిల్లీలో దీక్ష చేస్తే బీఆర్ఎస్ తరపున వెయ్యి మందిని తీసుకోస్తామన్నారు. అంద‌రం క‌లిసి రాష్ట్రానికి నిధుల విషయంలో కేంద్రంతో తేల్చుకుందామన్నారు.

కేటీఆర్ వ్యాఖ్యలపై స్పందించారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రతిపక్ష నేతగా కేసీఆర్ వస్తే తాను ఢిల్లీలో జంతర్‌మంతర్ వ‌ద్ద దీక్ష చేసేందుకు సిద్ధమనన్నారు. నిధులు తెచ్చుడో, సచ్చుడో తేల్చుకుందామన్నారు. దీక్షకు డేట్ ఫిక్స్ చేయాలంటూ బీఆర్ఎస్ నేతలకు సూచించారు సీఎం.

First Published:  24 July 2024 1:34 PM GMT
Next Story