మీరన్నదే గుర్తు చేశా.. భట్టికి కేటీఆర్ కౌంటర్
భట్టి విక్రమార్క విమర్శలకు కౌంటర్ ఇచ్చారు కేటీఆర్. కరెంటు బిల్లులు కట్టొద్దని తానేమి కొత్తగా చెప్పలేదన్నారు. ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేసిన ప్రకటననే గుర్తు చేశానన్నారు.
తెలంగాణలో కరెంటు బిల్లుల చెల్లింపు విషయమై అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్‌ల మధ్య డైలాగ్ వార్ కంటిన్యూ అవుతోంది. కరెంటు బిల్లులు కట్టొదన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యలపై డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మండిపడ్డ విషయం తెలిసిందే. అయితే తాజాగా భట్టి విక్రమార్కకు కౌంటర్ ఇచ్చారు కేటీఆర్. ఎన్నికల ప్రచారంలో భాగంగా అప్పటి పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రసంగాలను తన ట్విట్టర్‌లో పోస్టు చేశారు.
Dear @Bhatti_Mallu Garu,
— KTR (@KTRBRS) January 21, 2024
I was merely reminding & referring to the statements made by CM Revanth Reddy Garu and Minister Venkat Reddy Garu
They both had asked people of Telangana to STOP paying their electricity Bills from November/December 2023 onwards
Also the CM had… https://t.co/gIZ1NIi0cg
భట్టి విక్రమార్క విమర్శలకు కౌంటర్ ఇచ్చారు కేటీఆర్. కరెంటు బిల్లులు కట్టొద్దని తానేమి కొత్తగా చెప్పలేదన్నారు. ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేసిన ప్రకటననే గుర్తు చేశానన్నారు. నవంబర్, డిసెంబర్ నెల కరెంటు బిల్లులు కూడా కట్టొద్దని ఈ ఇద్దరు తెలంగాణ ప్రజలను కోరారన్నారు కేటీఆర్. అలాగే కరెంటు బిల్లులు చెల్లించే బాధ్యతను సోనియా గాంధీ తీసుకుంటారని రేవంత్ రెడ్డి స్పష్టంగా తన ప్రసంగంలో చెప్పారని గుర్తు చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలను తన ట్విట్టర్‌లో పోస్టు చేశారు కేటీఆర్.
కరెంటు బిల్లుల విషయమై ఇప్పటికైనా సంబంధిత డిపార్టుమెంటుకు ఆదేశాలు జారీ చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కోరారు కేటీఆర్. డిస్కమ్‌ల నుంచి బలవంతపు చర్యలు ఉంటే విద్యుత్ బిల్లులను టెన్ జన్‌పథ్‌కు పంపే కార్యక్రమాన్ని చేపడతామన్నారు.