Telugu Global
Telangana

నటి కంగ‌నాపై దానం నాగేంద‌ర్ కామెంట్స్‌ను ఖండించిన కేటీఆర్

నటి కంగనా రనౌత్‌‌పై ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ చేసిన వ్యాఖ్యలను బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఖండించారు. మ‌హిళ‌ల‌ను కించ‌ప‌రిచే విధంగా రాజ‌కీయాలు ఉండ‌కూడ‌దన్నారు.

నటి కంగ‌నాపై దానం నాగేంద‌ర్ కామెంట్స్‌ను ఖండించిన కేటీఆర్
X

నటి కంగనా రనౌత్‌‌పై ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ చేసిన వ్యాఖ్యలను బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఖండించారు. మ‌హిళ‌ల‌ను కించ‌ప‌రిచే విధంగా రాజ‌కీయాలు ఉండ‌కూడ‌దన్నారు. మండి ఎంపీ కంగ‌నా ప‌ట్ల దానం నాగేంద‌ర్ ఉప‌యోగించిన నీచ‌మైన‌ భాష ఆమోద‌యోగ్యం కాద‌ని కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పందించారు. సినిమాల్లో బోగం వేషాలు వేసుకునే కంగనా రనౌత్‌కు రాహుల్‌ గాంధీని విమర్శించే నైతిక హక్కు లేదంటూ దానం నాగేందర్ కామెంట్స్ చేశారు. కంగ‌నా అభిప్రాయాల‌ను, ఆమె పార్టీ ఐడియాల‌జీని తాను ఏకీభ‌వించ‌ను.. కానీ ఇలా దిగ‌జారుడు మాట‌లు మాట్లాడ‌టం స‌రికాదు. ఢిల్లీలో, తెలంగాణలోని కాంగ్రెస్ నేతలు కూడా దానం నాగేంద‌ర్ వ్యాఖ్య‌ల ప‌ట్ల‌ మౌనం వహించడం ఆశ్చర్యంగా ఉంది. నాగేందర్ కామెంట్స్‌ను వారు ఆమోదిస్తున్నారా..? అని కేటీఆర్ ప్ర‌శ్నించారు.

నటి కంగనా రనౌత్‌‌పై ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ చేసిన వ్యాఖ్యలను బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఖండించారు. మ‌హిళ‌ల‌ను కించ‌ప‌రిచే విధంగా రాజ‌కీయాలు ఉండ‌కూడ‌దన్నారు.అసోం సీఎం హిమంత బిస్వా శ‌ర్మ.. సోనియా గాంధీ ప‌ట్ల అనుచిత వ్యాఖ్య‌లు చేసిన‌ప్పుడు.. తెలంగాణ‌లోని మీ సొంత పార్టీ స‌భ్యులు,సీఎం రేవంత్ రెడ్డి స్పందించ‌క‌ముందే.. మాజీ సీఎం కేసీఆర్ స్పందించారు. సోనియా గాంధీని అవ‌మానించేలా హిమంత బిస్వా శ‌ర్మ చేసిన వ్యాఖ్య‌ల‌ను రేవంత్ రెడ్డి కంటే ముందే కేసీఆర్ ఖండించిన విష‌యాన్ని గుర్తు చేస్తున్నాను. పాలిటిక్స్ ప‌క్క‌న‌పెడితే నీతి, మ‌ర్యాద‌కు క‌ట్టుబ‌డి ఉంటామ‌న్నారు కేటీఆర్. క్రూర‌మైన నేరం.. క్రూర‌మైన నేర‌మే. అది రేప్ కావొచ్చు. మ‌ర్డ‌ర్ కావొచ్చు.. మ‌హిళ‌ల‌ను కించ‌ప‌రిచేలా మాట్లాడ‌డం కూడా నేర‌మే. మీ పార్టీలో ఉన్న‌త ప్ర‌మాణాల‌ను నెల‌కొల్పాల‌ని, పార్టీ కేడ‌ర్‌కు విలువ‌లు నేర్పాల‌ని సూచిస్తున్నాను. మహిళలను గౌర‌వించ‌డం అనేది మ‌ర్యాద‌కు సంబంధించిన అంశం అని కేటీఆర్ స్ప‌ష్టం చేశారు.

First Published:  20 Sept 2024 5:56 AM IST
Next Story