ఆత్మహత్య చేసుకున్న నేతన్న కుటుంబానికి కేటీఆర్ భరోసా
సిరిసిల్లలో అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న నేతన్న బైరి అమర్ దంపతుల కుటుంబసభ్యులను బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించారు.
BY Vamshi Kotas10 Nov 2024 8:44 PM IST
X
Vamshi Kotas Updated On: 10 Nov 2024 8:44 PM IST
సిరిసిల్లలో అప్పుల బాధతో సూసైడ్ చేసుకున్న నేతన్న బైరి అమర్ దంపతుల కుటుంబ సభ్యులను మాజీ మంత్రి కేటీఆర్ పరామర్శించారు. ఇవాళ సాయంత్రం సిరిసిల్లకు చేరుకున్న కేటీఆర్.. వెంకంపేటలోని భైరి అమర్- స్రవంతి కుటుంబసభ్యులను ఓదార్చారు. వారి పిల్లల చదువుకు అయ్యే ఖర్చు మొత్తం తానే భరిస్తానని భరోసా ఇచ్చారు. అలాగే ముగ్గురు పిల్లలకు ఒక్కొక్కరికి రూ.2లక్షల చొప్పున డిపాజిట్ చేయిస్తానని హామీ ఇచ్చారు. ధైర్యంగా ఉండాలని.. బాగా చదువుకోవాలని ఈ సందర్భంగా భైరి అమర్ పిల్లలకు కేటీఆర్ సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వాకంతో అప్పుల బాధతో నేతన్నలు ఆత్మహత్య చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
Next Story