ఖమ్మం పేలుడు ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన కేటీఆర్, హరీష్ రావు
ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ నేతలతో, అధికారులతో కేటీఆర్ మాట్లాడారు. మృతుల కుటుంబాలను, క్షతగాత్రులను అన్ని విధాలా ఆదుకుంటామని కేటీఆర్ చెప్పారు. గాయపడిన వారిని హైదరాబాద్ తరలించి మెరుగైన చికిత్స అందించాలని కేటీఆర్ అధికారులను ఆదేశించారు.
ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గంలోని కారేపల్లి మండలం చీమలపాడు వద్ద జరిగిన పేలుడు ఘటనపై బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ నేతలతో, అధికారులతో కేటీఆర్ మాట్లాడారు. మృతుల కుటుంబాలను, క్షతగాత్రులను అన్ని విధాలా ఆదుకుంటామని కేటీఆర్ చెప్పారు. గాయపడిన వారిని హైదరాబాద్ తరలించి మెరుగైన చికిత్స అందించాలని కేటీఆర్ అధికారులను ఆదేశించారు.
హరీష్ రావు కూడా స్థానిక నేతలతో మాట్లాడారు. ఖమ్మం వైద్య అధికారులతో మాట్లాడిన హరీష్ రావు గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని ఆదేశించారు.
కాగా, ఈ ఘటనలో రమేష్, మంగు, సందీప్ అనే ముగ్గురు వ్యక్తులు మరణించగా 8 మంది తీవ్ర గాయాలపాలయ్యారు. బీఆర్ఎస్ కార్యకర్తలు పేల్చిన బాణా సంచా పక్కనే ఉన్న పూరి గుడిసె మీద పడి, ఆ గుడిసెకు నిప్పంటుకొని అందులో ఉన్న గ్యాస్ సిలండర్ పేలిపోవడంతో ఈ ప్రమాదం సంభవించింది.