Telugu Global
Telangana

రాజ‌గోపాల్ రెడ్డి క్విడ్ ప్రొ కో, 18వేల కాంట్రాక్టుకు బదులుగా బీజేపీలో చేరాడు ‍-కేటీఆర్ ట్వీట్‌

బీజేపీ మునుగోడు అభ్యర్థి కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డిపై మంత్రి కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు. 18,000 కోట్ల రూపాయల కాంట్రాక్ట్‌ను పొందినందుకే ఆయన‌ BJPలో చేరాడని కేటీఆర్ అన్నారు.

రాజ‌గోపాల్ రెడ్డి క్విడ్ ప్రొ కో, 18వేల కాంట్రాక్టుకు బదులుగా బీజేపీలో చేరాడు ‍-కేటీఆర్ ట్వీట్‌
X

కోమటి రెడ్డి కాంగ్రెస్ కు రాజీనామా చేసి బీజేపీలో ఎందుకు చేరాడో చెప్పేశారు మంత్రి కేటీఆర్. ఆ చేరిక‌ ఓ క్విడ్ ప్రో కో అని ఆరోపించారు కేటీఆర్. ఓ టీవీ ఛానల్ లో రాజగోపాల్ రెడ్డి మాట్లాడిన వీడియోను షేర్ చేసిన కేటీఆర్. రూ.18 వేల కోట్ల విలువైన కాంట్రాక్టు ద‌క్కినందుకే కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి బీజేపీలో చేరారని శుక్ర‌వారం రాత్రి ట్వీట్ చేశారు.

.ఓ తెలుగు న్యూస్ ఛానెల్ నిర్వ‌హించిన డిబేట్ లో కోమటి రెడ్డి రాజగోపాల్ రేడ్డి మాట్లాడుతూ.. 6 నెల‌ల క్రితం త‌న కంపెనీకి రూ.18 వేల కోట్ల విలువైన కాంట్రాక్టు ద‌క్కింద‌ని కోమటిరెడ్డి వెల్ల‌డించారు. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో షేర్ చేస్తూ టీఆరెస్ నేతలు, నెటిజనులు రాజగోపాల్ రెడ్డిపై విమర్శలు చేస్తున్నారు. తన స్వలాభంగా కోసమే బీజేపీలో చేరాడని ఆరోపణలు చేస్తున్నారు.

ఇదే వీడియోను షేర్ చేసిన కేటీఆర్... '' ఇది క్విడ్ ప్రోకో - మునుగోడు బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి బహిరంగంగా ఒప్పుకున్నారు.

అతని కంపెనీ ₹18,000 కోట్ల కాంట్రాక్ట్‌ను పొందింది. దానికి బదులుగా ఆయన‌ BJPలో చేరాడు

ఆయన బాటలోనే ఆయన సోదరుడు కాంగ్రెస్ ఎంపీ కూడా నడిచే అవకాశం ఉంది.'' అని కేటీఆర్ ట్వీట్ లో కామెంట్ చేశారు.


First Published:  7 Oct 2022 11:09 PM IST
Next Story