హామీలు అమలు చేసేదాకా వెంటాడతాం, వేటాడతాం..
రాజకీయ పార్టీలన్న తర్వాత గెలుపు, ఓటములు సహజం అని.. సంతోషాలు, బాధలు ఉంటాయని చెప్పారు కేటీఆర్. ఓడిపోయినంత మాత్రాన కుంగిపోయేది లేదని, ప్రజలిచ్చిన ప్రతిపక్ష బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తామని అన్నారు.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలయ్యే వరకు వెంటాడతాం, వేటాడతామని హెచ్చరించారు కేటీఆర్. హామీలు అమలు చేయకుండా కాంగ్రెస్ తప్పించుకోలేదని అన్నారాయన. రూ.2 లక్షల రుణమాఫీ, రూ.15 వేల రైతు భరోసా ఏమైందని సూటిగా ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి ఐదేళ్లు అధికారంలో ఉండి వారిచ్చిన 420 హామీలు అమలు చేయాలన్నారు. హామీల గురించి అడిగితే మానవ బాంబునవుతానంటూ రేవంత్ రెడ్డి చిత్ర విచిత్రమైన సమాధానాలు చెబుతున్నారని ఎద్దేవా చేశారు కేటీఆర్.
మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి (@LaxmaRagidi) గారికి మద్దతుగా మేడిపల్లిలో జరిగిన కార్యకర్తలతో సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS పాల్గొన్నారు.
— BRS Party (@BRSparty) April 10, 2024
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లడుతూ....
రాజకీయ పార్టీ అన్నప్పుడు గెలుస్తాం,… pic.twitter.com/fHZOa1QZoQ
మా బాధ్యత నెరవేరుస్తాం..
రాజకీయ పార్టీలన్న తర్వాత గెలుపు, ఓటములు సహజం అని.. సంతోషాలు, బాధలు ఉంటాయని చెప్పారు కేటీఆర్. ఓడిపోయినంత మాత్రాన కుంగిపోయేది లేదని, ప్రజలిచ్చిన ప్రతిపక్ష బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తామని అన్నారు. చావునోట్లో తలపెట్టి చావు అంచుకు వెళ్లి కేసీఆర్ తెలంగాణ సాధించారని గుర్తు చేశారు. తొలి ప్రభుత్వంగా పదేళ్లు ప్రజలు అవకాశం ఇస్తే తాగునీటి సమస్యలు, కరెంట్ సమస్యలు పరిష్కరించామని వివరించారు. సంక్షేమ కార్యక్రమాల అమలుతో పాటు కొత్త మెడికల్ కాలేజ్ లు, గురుకుల స్కూళ్లు ఏర్పాటు చేశామన్నారు. తమపై ప్రజలకు కోపం లేదని, ఒక్కసారి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇద్దామని వారు నిర్ణయించుకుని మార్పు కోరుకున్నారని అన్నారు. అయితే 100 రోజుల్లోనే కాంగ్రెస్ ఫెయిలైపోయిందని కౌంటర్ ఇచ్చారు కేటీఆర్.
రాహుల్‌గాంధీని పిచ్చోడిని చేస్తున్నారు.
రాహుల్ గాంధీని సీఎం రేవంత్‌రెడ్డి పిచ్చోడిని చేస్తున్నారని సెటైర్లు పేల్చారు కేటీఆర్. మోదీని రాహుల్ చౌకీదార్, చోర్ అంటుంటే.. రేవంత్ మాత్రం బడే భాయ్ అంటూ అభిమానం చూపిస్తున్నారని చెప్పారు. అదానీ ఫ్రాడ్ అని రాహుల్ అంటే.. హమారా ఫ్రెండ్ అని రేవంత్ చెప్పుకుంటున్నారని కౌంటర్ ఇచ్చారు. గుజరాత్ మోడల్ ఫేక్ అని రాహుల్ అంటే.. తెలంగాణను గుజరాత్ మోడల్ లాగా అభివృద్ధి చేస్తానంటూ రేవంత్ చెబుతున్నారని.. వీరిలో ఎవరిని నమ్మాలని ప్రశ్నించారు. రేవంత్‌రెడ్డికి దమ్ముంటే మల్కాజ్ గిరిలో ఎంపీగా పోటీ చేయాలని సవాల్ విసిరారు కేటీఆర్.