Telugu Global
Telangana

కేటీఆర్ చెప్పింది జగన్ గురించేనా..? పండగ చేసుకుంటున్న టీడీపీ

గంగవ్వ షో లో కేటీఆర్, జగన్ ప్రస్తావన తీసుకొచ్చారా..? ఆయన వ్యాఖ్యలతో టీడీపీ ఎందుకంత సంబరపడిపోతోంది...?

కేటీఆర్ చెప్పింది జగన్ గురించేనా..? పండగ చేసుకుంటున్న టీడీపీ
X

కేటీఆర్ చెప్పింది జగన్ గురించేనా..? పండగ చేసుకుంటున్న టీడీపీ

మై విలేజ్ షో లో గంగవ్వతో కలసి మంత్రి కేటీఆర్ సందడి చేసిన సంగతి తెలిసిందే. కూరగాయలు తరుగుతూ, చికెన్ వండుతూ కేటీఆర్ చెప్పిన మాటలు వైరల్ అవుతున్నాయి. తన వ్యక్తిగత విషయాలతోపాటు, తెలంగాణ భవిష్యత్ చిత్రాన్ని కూడా ఆయన ఈ షో లో ఆవిష్కరించారు. అయితే అదే షో లో ఆయన అభివృద్ధి, సంక్షేమం గురించి చెప్పిన మాటలు వైరల్ అవుతున్నాయి. ప్రత్యేకంగా టీడీపీ ట్విట్టర్ హ్యాండిల్స్ ఈ వీడియోని హైలైట్ చేస్తున్నాయి. జగన్ గురించి కేటీఆర్ చెప్పిన మాటలు అంటూ ఆ వీడియోని షేర్ చేస్తున్నారు టీడీపీ సానుభూతిపరులు.

ఇంతకీ కేటీఆర్ ఏమన్నారు..?

అభివృద్ధి, సంక్షేమం రెండూ జోడెద్దుల వంటివని అన్నారు మంత్రి కేటీఆర్. ఓవైపు సంపద పెంచుకుంటూ పోవాలని, ఆ సంపదను పంచాలని చెప్పారు. కేవలం పంచిపెట్టడం మాత్రమే తెలుసంటే కుదరదన్నారు. ఏ ఒక్కటి వదిలిపెట్టినా రాష్ట్రం డేంజర్ లో పడుతుందన్నారు. కొత్త రోడ్లు వేయాలి, కొత్త సౌకర్యాలు కల్పించాలి, విద్యుత్, నీరు, ప్రాజెక్ట్ లు.. ఇలా సంపద పెంచే పనులు చేయాలని చెప్పారు. రూపాయి పెట్టుబడి పెడితే, రూపాయి ఆదాయం రావాలని, అలా జరిగితేనే అభివృద్ధి సాధ్యమవుతుందని, సంక్షేమం ఆగకుండా కొనసాగుతుందన్నారు కేటీఆర్.


ఇక్కడ కేటీఆర్ నేరుగా జగన్ పేరెత్తలేదు. ఏపీ అనే ప్రస్తావన కూడా తేలేదు. కానీ ఏపీలో ప్రస్తుతం అలాంటి పరిస్థితులున్నాయని టీడీపీ ఆరోపిస్తోంది. అందుకే కేటీఆర్ వ్యాఖ్యల్ని జగన్ కి సింక్ చేస్తూ విమర్శలు ఎక్కుపెట్టింది. జగన్ అభివృద్ధిని పట్టించుకోవట్లేదని, కేవలం సంక్షేమం అంటూ పంచుకుంటూ వెళ్తున్నారని కామెంట్లు చేస్తోంది. ఇటీవల ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యల్ని కూడా టీడీపీ హైలైట్ చేసింది. రోడ్లు, విద్యుత్ వ్యవస్థ గురించి తెలంగాణ, ఏపీ మధ్య పోలిక చెప్పారు కేసీఆర్. ఈ పోలికను ప్రస్తావిస్తూ టీడీపీ హడావిడి చేసింది, ఇప్పుడు కేటీఆర్ వ్యాఖ్యల్ని ఏపీకి లింకు చేస్తూ జగన్ ని టార్గెట్ చేస్తోంది టీడీపీ.

First Published:  5 Nov 2023 4:28 PM IST
Next Story