కైకాలతో సరిసమానులు ఈతరంలో ఎవరూ లేరు –కేసీఆర్
తెలుగు చలన చిత్ర పరిశ్రమ ఓ దిగ్గజాన్ని కోల్పోయిందని, ఆయన లేని లోటు ఎవరూ పూడ్చలేరని చెప్పారు కేసీఆర్. ఆయనకు సమానమైన నటులు ఈ తరంలో ఎవరూ లేరన్నారు.
సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ పార్థివ దేహానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఘన నివాళులర్పించారు. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. కైకాల విలక్షణమైన నటుడని చెప్పారు కేసీఆర్. ఎలాంటి పాత్రలోనైనా జీవించి, హీరోలకు సమానమైన పేరు తెచ్చుకున్నారని గుర్తు చేశారు. కైకాల ఎంపీగా ఉన్న రోజుల్లో.. ఆయనతో కలిసి పని చేసిన అనుభవం తనకగు ఉందని చెప్పారు కేసీఆర్.
సరిసమానులు లేరు..
తెలుగు చలన చిత్ర పరిశ్రమ ఓ దిగ్గజాన్ని కోల్పోయిందని, ఆయన లేని లోటు ఎవరూ పూడ్చలేరని చెప్పారు కేసీఆర్. ఆయనకు సమానమైన నటులు ఈ తరంలో ఎవరూ లేరన్నారు. కైకాల మృతి చాలా బాధాకరం అని, ఆయన కుటుంబానికి సానుభూతి తెలియజేశారు కేసీఆర్. రేపు ఉదయం పదిన్నర గంటలకు జూబ్లీ హిల్స్ లోని మహాప్రస్థానంలో సత్యనారాయణ అంత్యక్రియలు నిర్వహిస్తారు. తెలంగాణ ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరుగుతాయి.
1959లో సిపాయి కూతురు అనే చిత్రంతో సినీరంగ ప్రవేశం చేసిన కైకాల 60 సంవత్సరాలపాటు ఇండస్ట్రీలో ఉన్నారు. మొత్తం 777కి పైగా చిత్రాల్లో కైకాల తన ప్రతిభ చాటారు. పౌరాణిక, సాంఘిక, చారిత్రక, జానపద పాత్రల్లో తిరుగులేని నటుడిగా వెలుగొందారు. వైవిధ్యమైన పాత్రలతో నవరస నటనా సార్వభౌమ అనే బిరుదు పొందారు. విలన్ పాత్రలతో ఫేమస్ అయినా, మలివయసులో కుటుంబ పెద్దగా ఈ జనరేషన్ కి కూడా సుపరిచితులు కైకాల.