మెజార్టీలో టాప్ హరీష్ కాదు.. ఎవరో తెలుసా..?
ఇక మెజార్టీకి మారుపేరైనా హరీష్ రావు ఈసారి.. 82 వేల 308 ఓట్ల మెజార్టీ మాత్రమే సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థి పూజల హరికృష్ణ 23 వేల 206 ఓట్లు సాధించి రెండోస్థానంలో నిలిచారు.
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడు జరిగిన మెజార్టీ అంటే ముందుగా గుర్తుకు వచ్చే పేరు తన్నీరు హరీష్ రావు. కానీ, ఈసారి ఈ ఘనత ఆయనకు దక్కలేదు. మెజార్టీ విషయంలో ఆయన రెండో స్థానానికి పరిమితమయ్యారు.
ఈసారి తెలంగాణలోనే అత్యధిక మెజార్టీ సాధించిన అభ్యర్థిగా కుత్బుల్లాపూర్ బీఆర్ఎస్ అభ్యర్థి కె.పి.వివేకానంద నిలిచారు. వివేకానంద తన సమీప అభ్యర్థి కూన శ్రీశైలం గౌడ్‌పై 85 వేల 576 ఓట్ల మెజార్టీ సాధించారు. మొత్తంగా లక్షా 87 వేల 999 ఓట్లు సాధించారు వివేకానంద. తర్వాతి స్థానంలో నిలిచిన కూన శ్రీశైలం గౌడ్ లక్షా 2 వేల 423 ఓట్లు సాధించగా.. లక్షా 15 వందల 54 ఓట్లు సాధించిన కాంగ్రెస్ అభ్యర్థి కొలను హన్మంత రెడ్డి మూడో స్థానానికి పరిమితమయ్యారు.
ఇక మెజార్టీకి మారుపేరైనా హరీష్ రావు ఈసారి.. 82 వేల 308 ఓట్ల మెజార్టీ మాత్రమే సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థి పూజల హరికృష్ణ 23 వేల 206 ఓట్లు సాధించి రెండోస్థానంలో నిలిచారు. బీజేపీ అభ్యర్థి దూది శ్రీకాంత్ రెడ్డి 23 వేల 201 ఓట్లతో మూడో స్థానానికి పరిమితమయ్యారు. 2018 ఎన్నికల్లో హరీష్ రావు లక్షా 30 వేల ఓట్ల మెజార్టీ సాధించడం గమనార్హం.