ముగిసిన ఆపరేషన్.. వైద్యులు ఏమన్నారంటే..?
యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఎంపీ ప్రభాకర్ రెడ్డిని సీఎం కేసీఆర్ పరామర్శించారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. మంత్రి కేటీఆర్ కూడా ఆస్పత్రికి వచ్చి ప్రభాకర్ రెడ్డిని పరామర్శించారు. ఆయనకు అందించిన వైద్యం వివరాలు అడిగి తెలుసుకున్నారు.
బీఆర్ఎస్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డికి ఆపరేషన్ పూర్తయింది. దాదాపు 4 గంటల సేపు ఈ ఆపరేషన్ చేశారు వైద్యులు. లోపల రక్తం పేరుకుపోవడం, చిన్న ప్రేగుకు 4 చోట్ల గాయాలు కావడంతో సర్జరీ ఆలస్యమైందని వివరించారు యశోద ఆస్పత్రి వైద్యులు. హైదరాబాద్ కి తరలించడం ఆలస్యం అయి ఉంటే మరింత ఇబ్బంది అయ్యేదని చెప్పారు. ఆపరేషన్ పూర్తయిన తర్వాత వైద్యులు ఓ ప్రకటన విడుదల చేశారు.
4 గంటల పాటు మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి సర్జరీ
— BRS News (@BRSParty_News) October 30, 2023
చిన్న ప్రేగుకు 4 చోట్ల గాయాలు. 15 సెంటిమిటర్లపై కడుపును కట్ 10 సెంటిమిటర్లు చిన్న ప్రేగును తొలగించిన యశోద వైద్యులు.
గ్రీన్ ఛానెల్‌తో హైదరాబాద్‌కు తరిలించకపోతే మరింత ఇబ్బంది అయ్యేది.
రక్తం అంత కూడా కడుపులో… pic.twitter.com/CfhxbG9rDK
అసలేమైంది..?
కత్తిపోటుతో కొత్త ప్రభాకర్ రెడ్డికి కడుపులో తీవ్ర గాయమైంది. చిన్నప్రేగుకి కత్తి తగలడంతో దాదాపు 4చోట్ల గాయాలయ్యాయి. దీంతో రక్తస్రావం అయింది. ఆ రక్తం అంతా కడుపులో పేరుకుపోయింది. దాన్ని జాగ్రత్తగా తొలగించి, ఇన్ఫెక్ష్ కాకుండా కాపాడారు వైద్యులు. ఇక చిన్నప్రేగును కూడా 10సెంటీమిటర్ల మేర తొలగించాల్సి వచ్చింది. 4చోట్ల గాయాలు కావడం, దానికి కుట్లు వేయడం సాధ్యం కాకపోవడంతో.. పేగుని 10 సెంటీమీటర్ల మేర తొలగించామని చెప్పారు. కడుపుని 15 సెంటీమీటర్ల మేర కట్ చేసి.. లోపల ఉండిపోయిన రక్తాన్ని శుభ్రపరిచారు. చిన్నప్రేగుని కట్ చేసి తిరిగి కుట్లు వేశారు.
హత్యాయత్నానికి (తీవ్ర కత్తిపోటు) గురై హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న మెదక్ ఎంపీ , దుబ్బాక బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డిని పరామర్శించిన సీఎం కేసీఆర్ గారు.. వారి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.
— BRS News (@BRSParty_News) October 30, 2023
మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లకు సీఎం ఆదేశించారు. pic.twitter.com/7AcZri7LF4
కేసీఆర్, కేటీఆర్ పరామర్శ..
యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఎంపీ ప్రభాకర్ రెడ్డిని సీఎం కేసీఆర్ పరామర్శించారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. మంత్రి కేటీఆర్ కూడా ఆస్పత్రికి వచ్చి ప్రభాకర్ రెడ్డిని పరామర్శించారు. ఆయనకు అందించిన వైద్యం వివరాలు అడిగి తెలుసుకున్నారు.
హత్యాయత్నానికి గురై యశోదా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మెదక్ పార్లమెంట్ సభ్యులు, దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డిని పరామర్శించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS
— BRS News (@BRSParty_News) October 30, 2023
ప్రభాకర్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కుటుంబ… pic.twitter.com/6MmYby1IfZ