BSPతో పొత్తుపై కోనేరు సీరియస్.. కాంగ్రెస్‌లోకి జంప్..!
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సిర్పూర్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి పాల్వాయి హరీష్‌బాబు విజయం సాధించారు. పాల్వాయి హరీష్ బాబుకు 63 వేల 702 ఓట్లు రాగా.. రెండో స్థానంలో నిలిచిన కోనప్పకు.. 60 వేల 614 ఓట్లు వచ్చాయి.
లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీఆర్ఎస్-బీఎస్పీ పొత్తు తెరమీదకు రావడంతో.. కుమురంభీం జిల్లా సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప తీవ్ర మనస్తాపంలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో సిర్పూర్ నుంచి పోటీ చేసిన ప్రవీణ్ కుమార్ పరోక్షంగా కోనప్ప ఓటమికి కారణమయ్యారని ఆయన అనుచరులు భావిస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఆయన కాగజ్‌నగర్ పురపాలిక ఛైర్మన్‌లతో సహా కాంగ్రెస్‌లోకి వెళ్లాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన కుమురం భీం జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడిగా కూడా ఉన్నారు. నియోజకవర్గ కార్యకర్తలతో చర్చించిన అనంతరం పార్టీ మార్పుపై నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది.
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సిర్పూర్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి పాల్వాయి హరీష్‌బాబు విజయం సాధించారు. పాల్వాయి హరీష్ బాబుకు 63 వేల 702 ఓట్లు రాగా.. రెండో స్థానంలో నిలిచిన కోనప్పకు.. 60 వేల 614 ఓట్లు వచ్చాయి. కేవలం 2 వేల 196 ఓట్ల తేడాతో కోనప్ప ఓడిపోయారు. అయితే అనూహ్యంగా మూడో స్థానంలో నిలిచిన ప్రవీణ్ కుమార్ 44 వేల 646 ఓట్లు సాధించి పరోక్షంగా కోనేరు కోనప్ప ఓటమికి కారణమయ్యారనేది ఆయన అనుచరుల భావన.
మొత్తం మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు కోనప్ప. 2004లో కాంగ్రెస్ తరపున గెలిచిన ఆయన.. 2014లో బీఎస్పీ టికెట్‌పై గెలిచి బీఆర్ఎస్‌లో చేరారు. తర్వాత 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ టికెట్‌పై విజయం సాధించారు.