Telugu Global
Telangana

జాతీయ దర్యాప్తు సంస్థలను బిజెపి స్వార్ద రాజకీయాలకోసం ఉపయోగిస్తోంది... ఒప్పుకున్న బీజేపీ నాయకుడు

ఢిల్లీ మద్యం కుంభకోణాన్ని ఉదాహరణగా చూపుతూ, ఈ కేసులో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కె.కవితను కటకటాల వెనక్కి నెట్టాల్సిన రాజకీయ అవసరం ఉంటే, మోడీ ప్రభుత్వం ఇప్పటికే ఆ పని చేసి ఉండేదని, అయితే అసెంబ్లీ ఎన్నికల నాటికి అది బీజేపీకి ప్రతికూలంగా మారుతుందని అందువల్లే ఆమెను అరెస్టు చేయడం లేదని కొండా విశ్వేశ్వర్‌రెడ్డి అన్నారు.

జాతీయ దర్యాప్తు సంస్థలను బిజెపి స్వార్ద రాజకీయాలకోసం ఉపయోగిస్తోంది... ఒప్పుకున్న బీజేపీ నాయకుడు
X

మోడీ ప్రభుత్వ ప్రతీకార రాజకీయాల కోసం విపక్ష పార్టీల నాయకుల‌పై కేంద్ర దర్యాప్తు సస్థలను దుర్వినియోగం చేస్తున్నదని బీఆరెస్ తో సహా విపక్షాలన్నీ ఆరోపణలు గుప్పిస్తున్న నేపథ్యంలో అది నిజమే అని బీజేపీ నాయకుడు ఒప్పుకున్నారు. ఇతర రాజకీయ పార్టీలను లొంగదీసేందుకు తమ పార్టీ దర్యాప్తు సంస్థలను ఉపయోగించుకుంటోందని రాష్ట్ర బీజేపీ నేత, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి బహిరంగంగా అంగీకరించారు.

ప్రత్యర్థి పార్టీ నేతలను టార్గెట్ చేసేందుకు మోడీ ప్రభుత్వం దర్యాప్తు సంస్థలను ఉపయోగిస్తోందని విశ్వేశ్వర్ రెడ్డి ఓ యూట్యూబ్ ఛానల్ లో చెప్పారు.

ఆయన, ఢిల్లీ మద్యం కుంభకోణాన్ని ఉదాహరణగా చూపుతూ, ఈ కేసులో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కె.కవితను కటకటాల వెనక్కి నెట్టాల్సిన రాజకీయ అవసరం ఉంటే, మోడీ ప్రభుత్వం ఇప్పటికే ఆ పని చేసి ఉండేదని, అయితే అసెంబ్లీ ఎన్నికల నాటికి అది బీజేపీకి ప్రతికూలంగా మారుతుందని అందువల్లే ఆమెను అరెస్టు చేయడం లేదని ఆయన అన్నారు.

ప్రతిపక్ష పార్టీ నేతలను లక్ష్యంగా చేసుకునేందుకు ప్రభుత్వం కేంద్ర సంస్థలపై ఒత్తిడి తెచ్చిందని ఆయన అంగీకరించారు.

విశ్వేశ్వర్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై టీఎస్‌ఆర్‌ఈడీసీఓ చైర్మన్‌ వై.సతీష్‌రెడ్డి స్పందిస్తూ.. కేంద్ర దర్యాప్తు సంస్థలను మోడీ ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని స్పష్టమైందని అన్నారు.

సీబీఐ, ఈడీ, ఐటీలు బీజేపీ పంజరంలోని చిలుకలు. దేశంలో ఎమర్జెన్సీ లాంటి పరిస్థితి నెలకొందని విశ్వేశ్వర్ రెడ్డి మాటలను బట్టి అర్థమవుతోందని ఆయన ఆరోపించారు.


First Published:  22 March 2023 2:05 AM
Next Story