తీరు మార్చుకోని కొండా సురేఖ.. పీసీసీ చీఫ్ సూచనలు డోంట్ కేర్
సమంత విడాకులపై వ్యాఖ్యలను సమర్థించుకున్న మంత్రి
రాజకీయాల్లో నటి సమంత, అక్కినేని కుటుంబాన్ని లాగిన మంత్రి కొండా సురేఖ.. ఇప్పటికీ తన పద్ధతి మార్చుకోలేదు. మంత్రులు, కాంగ్రెస్ నాయకులు సంయమనం పాటించాలని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ చేసిన విజ్ఞప్తిని పెడ చెవిన పెట్టారు. తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చే పేరుతో మరోసారి తేనెతుట్టెను కదిపారు. ''నేను చెప్పింది తప్పే.. ఇప్పటి వరకు నాగచైతన్యకు సమంతకు ఎందుకు విడాకులు అయినయి అన్న విషయం ప్రపంచానికి తెలుసా? తెలువది కదా? నాగార్జున ఫ్యామిలీ సైడ్ నుంచి ఏమైనా చెప్పారా? ఆ అమ్మాయి చెప్పుకోలేదు కదా? మాకు ఇండస్ట్రీ నుంచి ఇంటర్నల్ గా తెలిసిన సమాచారం.. ఈ రోజు నాకు కోపం వచ్చి మాట్లాడాల్సి వచ్చింది.. మాట్లాడేసిన.. మాట్లాడుత కూడా.. నేను వాస్తవాలు మాట్లాడుత.. నాకు దాపరికం ఉండదు.. ఇక ముందు కూడా మాట్లాడుత.. కేటీఆర్ ఇదే చెప్తున్న.. ఈ రోజు నుంచి నువ్వు జిల్లాలల్ల తిరుగవు.. నువ్వు హైదరాబాద్ లో తిరుగవు.. నువ్వు ఇంట్ల నుంచి బయటికి రావు..'' అని సురేఖ మీడియాతో చెప్పారు. కేటీఆర్ తో రాజకీయ వైరం ఉంటే ఆయనపై విమర్శలు చేయాల్సింది పోయి మళ్లీ అక్కినేని కుటుంబం, సమంతపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తన తీరు మారదని ఆమె మరోసారి నిరూపించుకున్నారు.