కొండా సురేఖకు మంత్రి పదవిలో ఉండే అర్హత లేదు
మంత్రి నాపై చేసిన ఆరోపణలకు ఆధారాలుంటే సీబీఐ విచారణకు ఇవ్వాలని ఆర్‌ఎస్పీ డిమాండ్
బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గురుకుల బాట అనే కార్యక్రమం చేపట్టారని ఆపార్టీ నేత ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ తెలిపారు. గురుకుల విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకోవడానికి ఈ కార్యక్రమం చేపట్టారన్నారు. తెలంగాణ భవన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. గురుకుల బాట అని చెప్పగానే కాంగ్రెస్‌కు భయం పుట్టింది. మంత్రి కొండా సురేఖ శుక్రవారం నాపై ఆరోపణలు చేశారు. నేను విద్యార్థులకు కలుషిత ఆహారం పెడుతున్నానని చెప్పారు. తెలంగాణ ప్రజలు గతంలోనే కొండా సురేఖను తిరస్కరించారని అన్నారు. మహిళలపై ఆమె చేసిన ఆరోపణలకు కేసు పెట్టాలని కోర్టు చెప్పింది. ఆమెకు మంత్రి పదవిలో ఉండే అర్హత లేదన్నారు. గతంలో ఐపీఎస్ అధికారిగా ఉన్న నాకు కేంద్ర ప్రభుత్వం అవార్డు ఇచ్చింది. ఏడేళ్ల సర్వీస్‌ను వదిలేసి విద్యార్థుల కోసం రాజకీయాల్లోకి వచ్చాను. నాపై ఆరోపణలు ఉంటే బైటపెట్టాలని ఆర్‌ఎస్పీ సవాల్ విసిరారు. వాటికి ఆధారాలు ఉంటే సీబీఐ విచారణకు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.