గురుకుల సిబ్బందిపై ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఆగ్రహం
బీసీ బాలికల గురుకుల వసతి గృహాలను ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. భోజనంలో నాణ్యత లేదంటూ సిబ్బందిపై మండిపడ్డారు.
BY Vamshi Kotas29 Nov 2024 7:49 PM IST
X
Vamshi Kotas Updated On: 29 Nov 2024 7:49 PM IST
మునుగోడు పట్టణంలోని మహాత్మా జ్యోతిబాపూలే బీసీ బాలికల గురుకుల వసతి గృహాలను స్థానిక ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. అన్నం, కూరలు, సాంబారు పెరుగు నాసిరకంగా ఉన్నాయంటూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్నం మాడిపోవడంతో వంట మనిషిపై నిర్వాహకులను ఈ అన్నం పిల్లలు తింటారా అని ప్రశ్నించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని మెస్ చార్జీలు పెంచినప్పటికీ భోజనంలో నాణ్యత లేదంటూ ఏజెన్సీ నిర్వాహకులపై మండి పడ్డారు… మెరుగైన ఆహారాన్ని అందించాలని ఆదేశించారు. క్వాలీటి ఫుడ్ అందించటం లేదని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు . అన్నం మాడిపోవడంతో వంట మనిషిపై వంట ఏజెన్సీ నిర్వాహకులపై నిప్పులు చెరిగారు.
Next Story