కోమటిరెడ్డి సీఎం పదవికి అర్హుడు.. రేవంత్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
తనతో పాటు ముఖ్యమంత్రి అయ్యే అన్ని అర్హతలు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి ఉన్నాయంటూ రేవంత్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి.
సీఎం రేవంత్ రెడ్డి మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భువనగిరి ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డికి మద్దతుగా ప్రచారం నిర్వహించిన రేవంత్ రెడ్డి.. కోమటిరెడ్డి బ్రదర్స్‌ను ఉద్దేశించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నిజమైన పోరాటయోధుడు అంటూ ప్రశంసలు కురిపించారు.
తనతో పాటు ముఖ్యమంత్రి అయ్యే అన్ని అర్హతలు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి ఉన్నాయంటూ రేవంత్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి. అనివార్య పరిస్థితుల్లోనే తాను సీఎం అయ్యానంటూ చెప్పుకొచ్చారు రేవంత్ రెడ్డి. తెలంగాణ కోసం తెగించి, సొంత పార్టీని ధిక్కరించారంటూ కోమటిరెడ్డిని పొగిడారు. తెలంగాణ కోసం రాజీనామా చేసి దీక్ష చేశారన్నారు. కేసీఆర్ తెలంగాణ కోసం నకిలీ ఉద్యమాన్ని నడిపించారంటూ విమర్శించారు రేవంత్. తెలంగాణ కోసం కోమటిరెడ్డి సోదరులు హైకమాండ్‌ను ఒప్పించారన్నారు.
We’ll rename Yadadri to Yadagirigutta after elections - CM Revanth Reddy
— Naveena (@TheNaveena) April 21, 2024
BRS left the temple development works incomplete. I will sit at Sri LakshmiNarasimha Swamy temple and get it completed
Apart from me, only eligible person to be Chief Minister is Komatireddy Venkatreddy… pic.twitter.com/RJ84Bn9sGb
పార్లమెంట్ ఎన్నికల్లో భువనగిరిలో 3 లక్షల మెజార్టీ ఇవ్వాలని ఓటర్లను కోరారు రేవంత్ రెడ్డి. బీఆర్ఎస్‌కు ఒక్క సీటు ఇచ్చినా అది మోడీ ఖాతాలోకే వెళ్తుందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కేసీఆర్ కుట్రలు చేస్తున్నారన్నారు రేవంత్. దేశంలోని ప్రజాస్వామ్య వ్యవస్థలను మోదీ సర్వనాశనం చేశారంటూ మండిపడ్డారు.