Telugu Global
Telangana

కిషనన్నా..! అబద్ధాలు చెప్పొద్దు

తెలంగాణ విద్యుత్ వెలుగులకు కేంద్ర ప్రభుత్వమే కారణం అని గొప్పలు చెప్పుకున్నారు కిషన్ రెడ్డి. ఈ ట్వీట్ కి కౌంటర్ ఇచ్చారు కవిత. కరెంట్‌ పై కట్టుకథలు మానుకోండి అంటూ ఘాటుగా విమర్శించారు.

కిషనన్నా..! అబద్ధాలు చెప్పొద్దు
X

గొప్పలు చెప్పుకోబోయి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చిక్కుల్లో పడ్డారా..? ప్రధాని మోదీకి ఎలివేషన్ ఇవ్వబోయి చివరకు కేంద్రం పరువు తీసేశారా..? పరోక్షంగా కేసీఆర్ ప్రతిభ ఇదీ అని ఆయన చాటి చెప్పారా..? ఆయన ట్వీట్ చూస్తే ఈ విషయాలన్నీ స్పష్టమవుతాయి. అందుకే వెంటనే కౌంటర్ అటాక్ చేశారు ఎమ్మెల్సీ కవిత. తెలంగాణ కరెంటు కష్టాలు తీర్చింది మోదీ కాదు, కేసీఆర్ అని గణాంకాలతో సహా వివరించారు. కిషన్ రెడ్డి అన్నా అబద్ధాలు చెప్పొద్దు అంటూ సుతిమెత్తగా సెటైర్ వేశారు.

అసలు కిషన్ రెడ్డి ఏమన్నారు..?

పెద్దపల్లిలో ఎన్టీపీసీ విద్యుత్తు కేంద్రం ఏర్పాటు చేయడం ద్వారా తెలంగాణకు మోదీ ప్రభుత్వం నిరంతరాయంగా విద్యుత్తు సరఫరా చేస్తోంది అంటూ ట్వీట్ చేశారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. తెలంగాణ విద్యుత్ వెలుగులకు కేంద్ర ప్రభుత్వమే కారణం అని గొప్పలు చెప్పుకున్నారు. ఈ ట్వీట్ కి కౌంటర్ ఇచ్చారు కవిత. కరెంట్‌ పై కట్టుకథలు మానుకోండి అంటూ ఘాటుగా విమర్శించారు.


తెలంగాణ విద్యుత్ అత్యథిక డిమాండ్ 15,500 మెగావాట్లు అని, కిషన్ రెడ్డి చెబుతున్న ఎన్టీపీసీ ద్వారా కేవలం 680 మెగావాట్లు మాత్రమే సరఫరా అవుతోందని.. అలాంటప్పుడు తెలంగాణ మొత్తానికి ఎన్టీపీసీ ఎలా వెలుగునిస్తోందని ప్రశ్నించారు కవిత. ఎన్టీపీసీ ద్వారా వస్తున్న విద్యుత్ కేవలం 4 శాతమేనంటూ గణాంకాలతో సహా వివరించారు. కేంద్ర ప్రభుత్వం నిరంతర విద్యుత్ ను అందజేస్తోందంటూ అబద్దాలు ప్రచారం చేయొద్దని ఆమె కిషన్‌ రెడ్డికి సూచించారు. సీఎం కేసీఆర్ కృషి వల్లే తెలంగాణలో కరెంటు కష్టాలు తీరాయని, విద్యుత్ లోటు నుంచి మిగులు విద్యుత్ వరకు రాష్ట్రాన్ని అతి తక్కువ సమయంలో తీసుకువచ్చిన ఘనత కేసీఆర్‌ కే దక్కుతుందని స్పష్టం చేశారు.

First Published:  7 Nov 2023 10:42 AM IST
Next Story