Telugu Global
Telangana

సహకరించట్లేదు, సహకరించట్లేదు.. నిందలేసిన కిషన్ రెడ్డి

సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ పార్కింగ్‌ కు భూమి అడిగితే రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదన్నారు కిషన్ రెడ్డి. చర్లపల్లి కనెక్టివిటీ రోడ్‌ కు కూడా రాష్ట్రం స్పందించట్లేదన్నారు.

సహకరించట్లేదు, సహకరించట్లేదు.. నిందలేసిన కిషన్ రెడ్డి
X

తెలంగాణ అభివృద్ధి చెందుతుంటే దానికి కారణం తామేనంటారు. ఎక్కడైనా సమస్యలుంటే రాష్ట్ర ప్రభుత్వం సహకరించట్లేదని నిందలేస్తారు. ఇదీ ప్రస్తుతం తెలంగాణపై కేంద్రంలోని బీజేపీ నేతల వ్యూహం. ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నారంటూ తెలంగాణకు అవార్డులిచ్చే కేంద్ర ప్రభుత్వమే, కొన్ని సందర్భాల్లో రాజకీయ కారణాలతో నిందలేయడం చూస్తూనే ఉన్నాం. తాజాగా మరోసారి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలంగాణ ప్రభుత్వాన్ని టార్గెట్ చేయాలని చూశారు. అభివృద్ధికి సహకరించట్లేదని నిందలేశారు.


తెలంగాణకు కొన్ని కొత్త రైల్వే లైన్లు వస్తున్నట్టు ప్రకటించారు కిషన్ రెడ్డి. ఆదిలాబాద్‌ నుంచి పటాన్‌ చెరువు వరకు, వరంగల్‌ నుంచి గద్వాల వరకు, ఉందానగర్‌ నుంచి జగ్గయ్యపేట వరకు, వికారాబాద్‌-కృష్ణా జిల్లా మధ్య, రీజనల్ రింగ్ రోడ్ చుట్టూ ఔటర్‌ రింగ్‌ రైల్వే ప్రాజెక్ట్‌ రాబోతున్నట్టు వివరించారు. అయితే కేంద్ర ప్రభుత్వం గొప్పలు చెప్పుకునే క్రమంలో రాష్ట్రంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం సహకరించట్లేదని నిందలేశారు కిషన్ రెడ్డి.

సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ పార్కింగ్‌ కు భూమి అడిగితే రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదన్నారు కిషన్ రెడ్డి. చర్లపల్లి కనెక్టివిటీ రోడ్‌ కు కూడా రాష్ట్రం స్పందించట్లేదన్నారు. యాదాద్రి ఎంఎంటీఎస్‌ తో సహా పలు ప్రాజెక్టులకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించట్లేదన్నారు. రైల్వే విస్తరణ రాష్ట్ర ప్రభుత్వానికి ఇష్టం లేదని కూడా నిందలేశారు. మోదీ హయాంలోనే రైల్వేల అభివృద్ధి అడ్డులేకుండా సాగుతోందని వివరించారు కిషన్ రెడ్డి. ఆయన వ్యాఖ్యలకు బీఆర్ఎస్ స్పందించాల్సి ఉంది.

First Published:  3 Sept 2023 8:02 PM IST
Next Story