Telugu Global
Telangana

బీజేపీ ఎమ్మెల్యేలకు కిషన్‌రెడ్డి దిశానిర్దేశం

తెలంగాణ శాసనసభలో అనుసరించాల్సిన వ్యూహాలపై ఎమ్మెల్యేలకు బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్‌రెడ్డి దిశానిర్దేశం చేశారు.

బీజేపీ ఎమ్మెల్యేలకు కిషన్‌రెడ్డి దిశానిర్దేశం
X

తెలంగాణ శాసన సభలో ప్రభుత్వాన్నీ నిలదీయాలని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. ఎమ్మెల్యేలకు అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం చేశారు. ఈ మేరకు పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఎమ్మెల్యేలతో కిషన్‌రెడ్డి సమావేశమయ్యారు. శాసన సభ సమావేశాల్లో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలన్నారు. ప్రజా సమస్యలే ప్రధాన అజెండాగా గళమెత్తాలన్నారు.

సభలో మాట్లాడే సమయంలో ఉపయోగించే భాష విషయంలో నిబంధనలకు విరుద్ధంగా కాకుండా జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. మాట్లాడాలనుకునే అంశాన్ని ముందుగానే నిర్ణయించుకొని.. ఎవరు ఏ అంశంపై మాట్లాడాలో సిద్దం చేసుకొని అసెంబ్లీలో మాట్లాడే విధంగా సన్నద్ధం కావాలని కేంద్ర మంత్రి సూచించారు.

First Published:  15 March 2025 9:01 PM IST
Next Story