Telugu Global
Telangana

నీలోఫర్ ఆస్పత్రిలో పసికందు కిడ్నాప్ కలకలం

నీలోఫర్ ఆస్పత్రిలో నెల రోజుల పసికందును గుర్తుతెలియని మహిళ కిడ్నాప్ చేయడం కలకలం సృష్టిస్తోంది.

నీలోఫర్ ఆస్పత్రిలో పసికందు కిడ్నాప్ కలకలం
X

హైదరాబాద్ నీలోఫర్ ఆస్పత్రిలో నెల రోజున పసికందును గుర్తు తెలియని మహిళ కిడ్నాప్ చేయడం కలకలం రేపింది. సంగారెడ్డి జిల్లా. జహీరాబాద్‌కు చెందిన హసీనా బేగం, గఫర్ దంపతులకు నెల రోజుల కిందట బాబు జన్మించాడు. చిన్నారి జాండీస్ రావడంతో వైద్యం కోసం నీలోఫర్ ఆస్పత్రికి తీసుకువచ్చారు. అయితే చికిత్స కోసం ఎదురుచూస్తున్న వారికి ఆస్పత్రి సిబ్బందినని చెప్పిన ఓ గుర్తుతెలియని మహిళ.. వారి వద్ద నుంచి చిన్నారిని తీసుకుని వెళ్లిపోయింది. ఎంతసేపటికీ బాబును తీసుకురాకపోవడంతో ఆస్పత్రి మొత్తం వెతికినా బాబు, ఆ మహిళ కనిపించలేదు.

అనుమానం వచ్చిన తల్లి హసీనా వెంటనే నాంపల్లి పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆస్పత్రిలో భద్రతా వైఫల్యం కారణంగానే కిడ్నాప్‌ చేశారని బాధిత తల్లి ఆరోపిస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆస్పత్రి వద్ద సీసీ కెమెరాలను పరిశీలించేందుకు చర్యలు చేపట్టారు. చిన్నారి కిడ్నాప్‌కు ఆస్పత్రి సెక్యురిటీ వైఫల్యమే కారణమని బాధిత కుటుంబం ఆరోపిస్తోంది. అయితే ఇటీవల ఆస్పత్రుల నుంచి చిన్న పిల్లలను ఎత్తుకెళ్తున్న కేసులు తరచూ నమోదు అవుతున్నాయి. ఈ ఘటనలు తీవ్ర సంచలనంగా మారుతున్నాయి. కొందరు మహిళలు పిల్లలను ఎత్తుకెళ్లి అమ్ముకుంటున్నారు

First Published:  23 Nov 2024 9:06 PM IST
Next Story