Telugu Global
Telangana

కాంగ్రెస్ ది తప్పుడు ప్రచారం.. ఖమ్మం పోలీస్ వివరణ

స‌భ‌కు వ‌చ్చే వాహ‌నాల‌ను పోలీసులు అడ్డుకుంటున్నార‌ని సోష‌ల్ మీడియాలో వ‌స్తున్న వార్త‌ల్లో నిజం లేద‌న్నారు ఖ‌మ్మం పోలీసు క‌మిష‌న‌ర్. త‌ప్పుడు ప్ర‌చారం చేసే వారిపై చ‌ట్ట‌ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని ఆయన హెచ్చరించారు.

కాంగ్రెస్ ది తప్పుడు ప్రచారం.. ఖమ్మం పోలీస్ వివరణ
X

ఖమ్మంలో కాంగ్రెస్ సభకు తెలంగాణ ప్రభుత్వం అడ్డంకులు సృష్టిస్తోందంటూ నాయకులు హడావిడి చేస్తున్న సంగతి తెలిసిందే. అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తామంటూ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వంటి నేతలు సినిమా డైలాగులు కూడా కొట్టారు. రేణుకా చౌదరి సహా మరికొందరు నేతలు పోలీసులకు సోషల్ మీడియా వేదికగా వార్నింగ్ లు ఇచ్చారు. కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే ఇదంతా తప్పుడు ప్రచారం అంటున్నారు ఖమ్మం పోలీస్ కమిషనర్ విష్ణు.

కాంగ్రెస్ పార్టీ నిర్వ‌హిస్తున్న జ‌న‌గ‌ర్జ‌న స‌భ‌కు పోలీసులు ఎలాంటి అడ్డంకులు సృష్టించ‌లేద‌ని తెలిపారు ఖ‌మ్మం పోలీసు క‌మిష‌న‌ర్ విష్ణు. కాంగ్రెస్ స‌భ‌కు వెళ్తున్న వారితో పాటు వారి వాహ‌నాలు అడ్డుకుంటున్నామ‌న్న వార్త‌ల్లో వాస్త‌వం లేద‌న్నారు. ట్రాఫిక్ డైవ‌ర్ష‌న్ మిన‌హా ఎక్క‌డా చెక్‌ పోస్టులు కూడా ఏర్పాటు చేయలేద‌ని స్ప‌ష్టం చేశారు. స‌భ‌కు వ‌చ్చే వాహ‌నాల‌ను పోలీసులు అడ్డుకుంటున్నార‌ని సోష‌ల్ మీడియాలో వ‌స్తున్న వార్త‌ల్లో నిజం లేద‌న్నారు. త‌ప్పుడు ప్ర‌చారం చేసే వారిపై చ‌ట్ట‌ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని ఆయన హెచ్చరించారు.

ప్రచారం కోసమేనా..?

ఖమ్మం సభకు రాహుల్ గాంధీ వస్తుండటంతో కాంగ్రెస్ నేతలు హడావిడి చేస్తున్నారు. ఎవరికి వారే బలప్రదర్శన చేపట్టాలని జన సమీకరణకు సిద్ధమయ్యారు. అయితే జన సమీకరణకు బీఆర్ఎస్ నాయకులు, పోలీసులు అడ్డుపడుతున్నారని ఉదయం నుంచి కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ ఆరోపణలకు బీఆర్ఎస్ నుంచి కౌంటర్లు పడుతున్నాయి. కాంగ్రెస్ సభకు జనాలు రావట్లేదని, అందుకే ఆ పార్టీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని బీఆర్ఎస్ నేతలు ప్రత్యారోపణలు చేశారు.

First Published:  2 July 2023 5:43 PM IST
Next Story