కాంగ్రెస్‌లోకి దానం.. సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిగా అవకాశం!
కాంగ్రెస్‌లో చేరడంపై దానం నాగేందర్ ఇప్పటివరకూ అధికారిక ప్రకటన చేయలేదు. ఇక కాంగ్రెస్ ఆయనను సికింద్రాబాద్ అభ్యర్థిగా పోటీ చేయించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
ఖైరతాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ త్వరలోనే కాంగ్రెస్‌లో చేరనున్నారు. ఈ నెల 18న ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. గ్రేటర్‌లో ఒక్క ఎమ్మెల్యే కూడా లేకపోవడంతో దానం నాగేందర్‌ను చేర్చుకునేందుకు కాంగ్రెస్ ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్‌కు గ్రేటర్‌లో ఎమ్మెల్యే లేకపోవడంతో కేబినెట్ బెర్తులు సైతం ఖాళీగా ఉన్నాయి.
కాంగ్రెస్‌లో చేరడంపై దానం నాగేందర్ ఇప్పటివరకూ అధికారిక ప్రకటన చేయలేదు. ఇక కాంగ్రెస్ ఆయనను సికింద్రాబాద్ అభ్యర్థిగా పోటీ చేయించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. మొదట గ్రేటర్ హైదరాబాద్ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్‌ను లోక్‌సభకు పోటీ చేయించాలని భావించింది.
సికింద్రాబాద్ నుంచి బీజేపీ అభ్యర్థిగా మరోసారి కిషన్ రెడ్డి బరిలో ఉండనుండగా.. బీఆర్ఎస్ తలసాని శ్రీనివాస్ యాదవ్ పేరును పరిశీలిస్తోంది. ఈ నేపథ్యంలో దానం నాగేందర్ బలమైన అభ్యర్థి అవుతాడని కాంగ్రెస్ భావిస్తోంది. ఇప్పటివరకూ ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన దానం.. ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా పని చేశారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్‌లో చేరారు.