ఓఆర్ఆర్ పరిధిలోని గ్రామ పంచాయతీల విలీనానికి మార్గం సుగమం
తెలంగాణలో ఓఆర్ఆర్ పరిధిలోని గ్రామ పంచాయతీలను మున్సిపాలిటీలో విలీన ప్రక్రియలో ప్రభుత్వానికి ఊరట దక్కింది.
BY Vamshi Kotas5 Dec 2024 3:48 PM IST
X
Vamshi Kotas Updated On: 5 Dec 2024 4:08 PM IST
తెలంగాణలో ఓఆర్ఆర్ పరిధిలోని గ్రామ పంచాయతీలను మున్సిపాలిటీలో విలీన ప్రక్రియలో ప్రభుత్వానికి ఊరట దక్కింది. గ్రామ పంచాయతీల విలీనం పై దాఖలైన పిటిషన్లను తెలంగాణ హైకోర్టు ఇవాళ కొట్టివేసింది. తెలంగాణ సర్కార్ తీసుకొచ్చిన ఆర్డినెన్స్ ప్రకారమే విలీనం జరిగిందని ప్రభుత్వం తెలిపింది. పరిపాలనలో భాగంగా చట్టాలను తీసుకోచ్చే అధికారం శాసన సభకు ఉందని హైకోర్టు తెలిపింది.
రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల్లోని 51 గ్రామ పంచాయతీలను మున్సిపాలిటీల్లో విలీనం చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకువచ్చింది. అయితే గ్రామ పంచాయతీల విలీనాన్ని వ్యతిరేకిస్తూ పలువురు హైకోర్టులో సవాల్ చేశారు. విచారణ చేపట్టిన సీజే ధర్మాసనం ఈ పిటిషన్లను కొట్టివేస్తూ తాజాగా తీర్పు వెలువరించింది. ఈ తీర్పుతో మున్సిపాలిటీల్లో గ్రామ పంచాయతీల విలీనానికి మార్గం సుగమం అయినట్లైంది.
Next Story