Telugu Global
Telangana

ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనంపై హైకోర్టు కీలక ఆదేశాలు

ప్రభుత్వం నిర్దేశించిన విధంగా విద్యార్థులకు పోషకాలతో కూడిన భోజనం వడ్డించాలన్న ఉన్నత న్యాయస్థానం

ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనంపై హైకోర్టు కీలక ఆదేశాలు
X

ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనంపై దాఖలైన పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. ప్రభుత్వం నిర్దేశించిన విధంగా విద్యార్థులకు పోషకాలతో కూడిన భోజనం వడ్డించాలని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. భోజనం వికటించి విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటనల్లో నివేదికను సమర్పించాలని స్పష్టం చేసింది. తదుపరి విచారణను 6 వారాలకు వాయిదా వేసింది.

భోజనం వికటించిన ఘటనల్లో రెండు కమిటీలు ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వం తరఫున కోర్టుకు ఏఏజీ తెలిపారు. బాధ్యులైన వాళ్లను ఇప్పటికే సస్పెండ్‌ చేసినట్లు కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. నాణ్యమైన భోజనం అందించడానికి ఏజెన్సీలకు చెల్లించే డబ్బులను 40 శాతం పెంచినట్లు పేర్కొన్నారు. మరోవైపు పిటిషనర్‌ తరఫు న్యాయవాది చిక్కుడు ప్రభాకర్‌ వాదనలు వినిపిస్తూ.. పీఎం పోషణ్‌ పథకంలో భాగంగా గ్రామ, మండల, జిల్లా, రాష్ట్రస్థాయి కమిటీలుండాలని చెప్పారు. కమిటీల పర్యవేక్షణ సరిగ్గా లేకపోవడం వల్లనే ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయని పేర్కొన్నారు. కమిటీలు సరిగా పనిచేసేలా ఆదేశాలు జారీ చేయలన్నారు. దీనికి బదులిస్తూ.. అన్ని కమిటీలు పనిచేస్తున్నాయని ఏఏజీ తెలిపారు. దీంతో ఏఏజీ చెప్పిన వివరాలను హైకోర్టు నమోదు చేసింది.

First Published:  5 Dec 2024 3:46 PM IST
Next Story