Telugu Global
Telangana

తెలంగాణ విద్యా శాఖ కీలక నిర్ణయం

డీఎస్సీ స్పోర్ట్స్‌ కోటా అభ్యర్థుల సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు మళ్లీ నిర్వహించాలని తెలంగాణ విద్యా శాఖ నిర్ణయించింది.

తెలంగాణ విద్యా శాఖ కీలక నిర్ణయం
X

డీఎస్సీ స్పోర్ట్స్‌ కోటా అభ్యర్థుల సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు మళ్లీ నిర్వహించాలని తెలంగాణ విద్యా శాఖ నిర్ణయించింది. నవంబర్‌ 20, 21, 22 తేదీల్లో సర్టిఫికెట్స్ పరిశీలించాలని నిర్ణయం తీసుకుంది. పలువురు అభ్యర్థులు ఫేక్ సర్టిఫికెట్స్ పెట్టి స్పోర్ట్స్‌ కోటాలో ఎంపికైనట్లు ఫిర్యాదులు రావడంతో విద్యా శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. మొత్తంగా 393 మంది అభ్యర్థుల ధ్రువపత్రాలను అధికారులు మరోసారి పరిశీలించనున్నారు. ఈ మేరకు అభ్యర్థులకు విద్యాశాఖ సమాచారం అందించింది.

First Published:  13 Nov 2024 9:47 PM IST
Next Story