గ్రూప్ 2 పరీక్షలపై తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన
ఈ నెల 29, 30 రోజుల్లో పరీక్షల నిర్వహణకు రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాట్లను శరవేగంగా పూర్తి చేస్తోంది. ఇందుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది.
మరో 2 వారాల అనంతరం తెలంగాణలో గ్రూప్ 2 పరీక్షలు జరగనున్నాయి. ఈ నెల 29, 30 రోజుల్లో పరీక్షల నిర్వహణకు రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాట్లను శరవేగంగా పూర్తి చేస్తోంది. ఇందుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది.
పరీక్షలు జరగనున్న ఆగస్ట్ 29, 30 తేదీల్లో సెలవులను ప్రకటించింది. గ్రూప్స్ పరీక్షల నిమిత్తం సెంటర్లుగా ఎంపిక చేసిన స్కూళ్లకు ఈ సెలవులు మంజూరు చేసింది. ఇందుకు సంబంధించి తెలంగాణ స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ శ్రీదేవసేన ఆదేశాలు సైతం జారీ చేశారు.
ఈ నియామక పరీక్షల్లో మొత్తం 783 గ్రూప్ 2 ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు. ఏకంగా 5 లక్షల 51 వేల మందికి పైగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. మొత్తంగా 2 రోజుల్లో 4 పేపర్లకు పరీక్షలు నిర్వహిస్తారు. ఈ పరీక్షలను ఎలాంటి లోటుపాట్లు లేకుండా, విమర్శలకు తావు లేకుండా నిర్వహించేందుకు సంబంధిత అధికారులు పకబ్బందీగా ఏర్పాట్లు చేయడంలో తలమునకలయ్యారు.
ఇక ప్రభుత్వం నుంచి వచ్చిన తాజా ప్రకటన పరీక్షలు అనుకున్న తేదీల్లోనే జరగడం ఖాయమన్న సంకేతాలను స్పష్టంగా పంపించింది. ఆ ప్రకారంగానే ఏర్పాట్లు సైతం జరుగుతున్న తీరును అభ్యర్థులకు తెలియజేస్తోంది.