మోడీపై కేసీఆర్ పిట్టకథ... అసెంబ్లీలో నవ్వులు
మోడీ చుట్టూ ఉన్న వాళ్ళు ఆయన కు దేశంలో ఏంజరుగుతుందో వాస్తవాలు చెప్పకుండా ఆయనను పొగడ్తలతో ముంచెత్తుతున్నారని వాటిని విని మోడీ మురిసిపోతున్నారని వ్యంగ్యంగా వ్యాఖ్యానించిన కేసీఆర్ ఓ ఆసక్తికర కథను చెప్పారు.
అసెంబ్లీలో ద్రవ్య వినిమయ బిల్లుపై జరిగిన చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ, మోడీపై విరుచుకపడ్డారు. ఆయన విధానాలు దేశాన్ని నాశనం చేశాయని, ఆయన చుట్టూ ఉన్న వాళ్ళు ఆయన కు దేశంలో ఏంజరుగుతుందో వాస్తవాలు చెప్పకుండా ఆయనను పొగడ్తలతో ముంచెత్తుతున్నారని వాటిని విని మోడీ మురిసిపోతున్నారని వ్యంగ్యంగా వ్యాఖ్యానించిన కేసీఆర్ ఓ ఆసక్తికర కథను చెప్పారు.
తిరుమల రాయుడనే రాజు ఉండేవాడు. ఆయనకు ఒకటే కన్ను ఉండేది. ఆ విషయం లో ఆయన ఎప్పుడూ బాధపడుతుండేవాడు. అదే రాజ్యంలో ఒక కవి ఉండేవాడు. ఆయన పేదవాడు. రాజుగారి దగ్గర ఏదైన సహాయం పొందాలనుకుంటాడు. రాజుగారి దగ్గర బహుమానం పొందాలంటే ఆయనను బాగా పొగడాలని అందరూ సలహా ఇస్తారు. దాంతో ఆ కవి ఇష్టం లేకపోయినా రాజును పొగుడుతూ,‘అన్నా తిగూడి హరుడవు.. అన్నా తిని గూడనపుడు అసుర గురుండవు. అన్నాతిరుమలరాయ కన్నొక్కటే లేదు గానీ, కౌరవపతివే’ అని కవిత్వం చెబుతాడు.
అం టే, భార్యతో ఉన్నప్పు డు నువ్వు మూడు కళ్ల శివుడవు. ఆయన భార్య రెండు కళ్లతో కలిపి మూడు కళ్లు. ఇక భార్యతో లేనప్పు డు నువ్వు రాక్షసుల గురువైన శుక్రాచార్యుడంతటి వాడివి.
శుక్రాచార్యుడికి ఒక కన్ను మాత్రమే ఉంటుంది కదా! ఆ ఒక్క కన్ను కూడా లేకపోతే నువ్వేమైనా తక్కువ వాడివా ‘కౌరవపతి’. అం టే ధృ తరాష్ట్రుడంతటి వాడివి’ అని పొగుడుతాడు. ఇప్పు డు పార్లమెంట్లో బీజేపీనాయకులు ప్రధాని మోదీని ఉద్దేశించి అలాగే పొగుడుతున్నా రు. అని కేసీఆర్ ఎద్దేవా చేశారు. ఈ కథ విని అసెంబ్లీ అంతా నవ్వులతో నిండిపోయింది.