Telugu Global
Telangana

మెరుగైన కేసీఆర్ ఆరోగ్యం.. రేపు డిశ్చార్జ్

కేసీఆర్ ఆరోగ్యంపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని డాక్టర్లు తెలిపారు. ఆయన ఆరోగ్యం కుదుటపడటంతో శుక్రవారం డిశ్చార్జ్ చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు.

మెరుగైన కేసీఆర్ ఆరోగ్యం.. రేపు డిశ్చార్జ్
X

బీఆర్ ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు తుంటి ఎముక విరగడంతో హైదరాబాద్‌లోని యశోద ఆస్పత్రిలో సర్జరీ చేసిన సంగతి తెలిసిందే. కొన్ని రోజులుగా ఆయన ఆస్పత్రిలో కోలుకుంటున్నారు. అయితే కేసీఆర్ ఆరోగ్యం మెరుగవడంతో ఆయనను శుక్రవారం డిశ్చార్జ్ చేయాలని వైద్యులు నిర్ణయించారు. ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. ఈ విషయాన్ని యశోద ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు.

కేసీఆర్ ఆరోగ్యంపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని డాక్టర్లు తెలిపారు. ఆయన ఆరోగ్యం కుదుటపడటంతో శుక్రవారం డిశ్చార్జ్ చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత కేసీఆర్ హైదరాబాద్ నంది నగర్‌లో ఉన్న నివాసానికి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆ ఇంటిని సిద్ధం చేసినట్లు సమాచారం. ఇకపై కేసీఆర్ ఆ ఇంట్లోనే ఉండనున్నారు.

సిద్దిపేట జిల్లా ఎర్రవ‌ల్లి ఫామ్ హౌస్ లోని బాత్రూంలో ప్రమాదవశాత్తు కాలుజారి పడటంతో కేసీఆర్ గాయపడ్డారు. ఆయన తుంటి ఎముక విరిగినట్లు గుర్తించిన యశోద ఆస్పత్రి వైద్యులు ఆపరేషన్ నిర్వహించారు. తుంటి ఎముకకు స్టీల్ ప్లేట్లను అమర్చారు. శస్త్రచికిత్స విజయవంతం అయ్యి కేసీఆర్ కోలుకోవడంతో ఇప్పుడు డిశ్చార్జ్ చేయాలని వైద్యులు నిర్ణయించారు.

First Published:  14 Dec 2023 4:26 PM IST
Next Story