వరంగల్ ఎంపీ అభ్యర్థి ఎవరు.. కేసీఆర్ మదిలో ఏముంది..?
వరంగల్ ఎంపీ అభ్యర్థిగా ఆరూరి రమేష్‌ను మిగతా నేతలు ప్రతిపాదించగా.. పోటీకి ఆరూరి విముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం. తాను పోటీ చేయనని కేసీఆర్‌కు ఆరూరి తేల్చి చెప్పారని తెలిసింది.
పార్లమెంట్ పార్టీ సన్నాహాక సమావేశాల్లో భాగంగా ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలతో సమావేశమయ్యారు బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్. ఎంపీ అభ్యర్థి ఎవరిని ఎంపిక చేద్దామనే అంశంపై సుదీర్ఘంగా నేతలతో చర్చించారు. ఈ సమావేశానికి ఆరూరి రమేష్, కడియం శ్రీహరి, ఎర్రబెల్లి సహా మిగిలిన నేతలు హాజరయ్యారు.
అయితే వరంగల్ ఎంపీ అభ్యర్థిగా ఆరూరి రమేష్‌ను మిగతా నేతలు ప్రతిపాదించగా.. పోటీకి ఆరూరి విముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం. తాను పోటీ చేయనని కేసీఆర్‌కు ఆరూరి తేల్చి చెప్పారని తెలిసింది. దీంతో అభ్యర్థి ఎంపికపై తుదినిర్ణయాన్ని నేతలు కేసీఆర్‌కే వదిలేసినట్లు తెలుస్తోంది. పార్టీ నిర్ణయమేదైనా కట్టుబడి ఉంటామని నేతలు చెప్పినట్లు సమాచారం.
ప్రస్తుత సిట్టింగ్ ఎంపీ పసునూరి దయాకర్‌కు పార్టీ మరో ఛాన్స్ ఇచ్చే సూచనలు కనిపించడం లేదు. ఇక ఎస్సీ రిజర్వ్‌డ్ స్థానం అయిన వరంగల్ పార్లమెంట్ టికెట్‌ను తన కూతురు కావ్యకు ఇవ్వాలని కడియం శ్రీహరి కోరుతున్నారు. మరోవైపు పలువురు ఉద్యమకారులు సైతం ఆశావహుల జాబితాలో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో కేసీఆర్ ఎవరిని ఎంపిక చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఇక కాంగ్రెస్, బీజేపీలు సైతం వరంగల్ అభ్యర్థిపై తేల్చలేదు.