Telugu Global
Telangana

BRS పేరు మార్పుపై కేసీఆర్ నిర్ణయం.. ఆ రోజే కీలక ప్రకటన!

2001లో TRSను స్థాపించిన కేసీఆర్‌.. 2014లో ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించారు. అనంతరం జరిగిన రెండు వరుస ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తీసుకుచ్చారు.

BRS పేరు మార్పుపై కేసీఆర్ నిర్ణయం.. ఆ రోజే కీలక ప్రకటన!
X

BRSను మళ్లీ TRSగా మార్చాలన్న నిర్ణయానికి ఆ పార్టీ అధినేత కేసీఆర్‌ వచ్చినట్లు సమాచారం. ఈనెల 27న పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా దీనికి సంబంధించి కీలక ప్రకటన చేసే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. లోక్‌సభ ఎన్నికల్లో TRS పేరుతో పోటీచేస్తే మెరుగైన ఫలితాలు వస్తాయని పార్టీ నేతలు చెబుతున్నారు. క్షేత్రస్థాయిలోని కార్యకర్తలు కూడా BRSను TRSగా మార్చాలని పట్టుబడుతున్నట్లు తెలిసింది.

2001లో TRSను స్థాపించిన కేసీఆర్‌.. 2014లో ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించారు. అనంతరం జరిగిన రెండు వరుస ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తీసుకుచ్చారు. ఈ క్రమంలోనే పార్టీని విస్తరించి దేశరాజకీయాల్లో సత్తాచాటాలని భావించారు. 2022లో TRSను BRSగా మార్చారు. BRSగా పార్టీ పేరును మార్చాక రాష్ట్రంలో మొదటిసారి ఓటమిని చవి చూశారు కేసీఆర్.

అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత పలువురు బీఆర్ఎస్ సీనియర్లు బహిరంగంగానే పార్టీ పేరు మార్పును తప్పుపట్టారు. తిరిగి TRSగా పేరు మార్చాలని సూచించారు. మాజీమంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు వంటి నేతలు ఎప్పటినుంచో ఇదే చెప్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆ దిశగా పార్టీ అధినాయకత్వం కసరత్తు మొదలుపెట్టినట్లు తెలిసింది. కేసీఆర్‌ కూడా పార్టీ మార్పు విషయంలో సానుకూలంగా ఉన్నట్లు సమాచారం. కాగా పార్టీ పేరు మార్పుపై న్యాయపరమైన చిక్కులు ఏమైనా ఎదురవుతాయా అన్న దానిపైనా బీఆర్‌ఎస్‌ అధిష్ఠానం దృష్టి సారించిందని చెబుతున్నారు.

First Published:  7 April 2024 8:11 AM GMT
Next Story