ఇవాళ పాలేరుకు కేసీఆర్.. టార్గెట్ పొంగులేటి!
2014, 18 అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఒక్కొ సీటును మాత్రమే గెలిచింది బీఆర్ఎస్. ఈ సారి ఎలాగైనా మెరుగైన ఫలితాలు సాధించాలని ఆశిస్తోంది.
ఉమ్మడి ఖమ్మం జిల్లాపై బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఇవాళ ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పాలేరు నియోజకవర్గంలో నిర్వహించే ప్రజా ఆశీర్వాద సభకు కేసీఆర్ హాజరుకానున్నారు.
బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక ఖమ్మం జిల్లాలో చేసిన అభివృద్ధితో పాటు మేనిఫెస్టోను ప్రజలకు వివరించనున్నారు. మాజీ ఎంపీ పొంగులేటి టార్గెట్‌గా విమర్శనాస్త్రాలకు కేసీఆర్ రెడీ అయినట్లు తెలుస్తోంది.
ఖమ్మం జిల్లాలో పాలేరు హాట్ సీటుగా ఉంది. ఈ స్థానం నుంచి అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డిని ప్రకటించింది బీఆర్ఎస్. ఇక కాంగ్రెస్ పార్టీ నుంచి పొంగులేటి బరిలో నిలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పొత్తులో భాగంగా లెఫ్ట్ పార్టీలు సైతం పాలేరు సీటు కోసం పట్టుబడుతున్నాయి. ఇక ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ తొలి బహిరంగ సభ కావడంతో ఆ పార్టీ శ్రేణులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి.
2014, 18 అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఒక్కొ సీటును మాత్రమే గెలిచింది బీఆర్ఎస్. ఈ సారి ఎలాగైనా మెరుగైన ఫలితాలు సాధించాలని ఆశిస్తోంది. పాలేరు సభ తర్వాత మహబూబాబాద్, వర్దన్నపేట బహిరంగ సభల్లో పార్టీ అభ్యర్థులకు మద్దతుగా కేసీఆర్ ప్రచారం చేయనున్నారు.