Telugu Global
Telangana

కరెంటు కోతలపై కేసీఆర్ ట్వీట్‌.. ఏమన్నారంటే..

కాంగ్రెస్ పార్టీ పరిపాలనా వైఫల్యానికి ఇంతకన్నా గొప్ప నిదర్శనం ఏముంటుందని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రజలు, మేధావులు ఆలోచించాలని కోరారు కేసీఆర్.

కరెంటు కోతలపై కేసీఆర్ ట్వీట్‌.. ఏమన్నారంటే..
X

కరెంట్ కోతలపై అసహనం వ్యక్తం చేశారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. ఈ మేరకు ఆయన అధికారిక ట్విట్టర్‌ హ్యాండిల్‌లో పోస్టు చేశారు. తెలంగాణలో చాలా చిత్రవిచిత్రమైన సంఘటనలు జరుగుతున్నాయన్నారు కేసీఆర్. మహబూబ్ నగర్ ఎంపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా.. అభ్యర్థి మన్నె శ్రీనివాస్ రెడ్డి ఇంట్లో భోజనం చేస్తుండగా 2 సార్లు కరెంటు పోయిందన్నారు. కానీ, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి కరెంటు కోత‌లు లేవ‌ని ఊదరగొడుతున్నారని ఫైర్ అయ్యారు. వారివారి నియోజకవర్గాల్లో రోజుకు పదిసార్లు కరెంటు పోతోందని మాజీ ఎమ్మెల్యేలు తన దృష్టికి తీసుకువచ్చారన్నారు కేసీఆర్. కాంగ్రెస్ పార్టీ పరిపాలనా వైఫల్యానికి ఇంతకన్నా గొప్ప నిదర్శనం ఏముంటుందని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రజలు, మేధావులు ఆలోచించాలని కోరారు కేసీఆర్.


బీఆర్ఎస్‌లో జోష్..

అంతకుముందు బస్సు యాత్రను దిగ్విజయం చేస్తున్న నాయకులకు, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు కేసీఆర్. ఇదే ఊపుతో బస్సు యాత్రను ముందుకు కొనసాగించి.. పార్లమెంటు ఎన్నికల్లో గొప్ప విజయం సాధిద్దామన్నారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈరోజే ట్విట్టర్‌లోకి అడుగుపెట్టారు కేసీఆర్. అలా ట్విట్టర్‌లోకి వచ్చారో లేదో అపుడే 16వేలకు పైగా జనం కేసీఆర్‌ అకౌంట్‌ను ఫాలో అవుతున్నారు. ట్విట్టర్‌లో కేసీఆర్‌ ఎంట్రీపై బీఆర్ఎస్‌ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.

First Published:  27 April 2024 11:26 AM GMT
Next Story