ఖమ్మంపై కేసీఆర్ వరాల జల్లు
ఖమ్మం హెడ్ క్వార్టర్ లో ఉండే జర్నలిస్టులందరికీ ఇళ్ళ స్థలాలు ఇస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. ఈ బాధ్యతను ఆర్థిక మంత్రి హరీష్ రావు తీసుకోవాలని కేసీఆర్ సూచించారు.
ఖమ్మం జిల్లాకు కేసీఆర్ వరాల జల్లు కురిపించారు. ఖమ్మంలో జరిగిన బీఆరెస్ బహిరంగసభలో ఆయన మాట్లాడుతూ, ఖమ్మం మున్సిపాలిటీ కి రూ.50 కోట్ల నిధులు మంజూరు చేస్తున్నట్టు ప్రకటించారు. జిల్లాలోని మిగతా మున్సిపాలిటీలకు ఒక్కో దానికి రూ.30 కోట్లు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు.
ఖమ్మంలో ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీ మంజూరు చేస్తున్నట్టు కేసీఆర్ ప్రకటించారు. అంతే కాకుండా ప్రతి గ్రామ పంచాయితీకి రూ.10 లక్షలు, 10 వేల జనాభాకు మించి ఉన్న మేజర్ గ్రామ పంచాయితీలైన పెద్దతాండ, కల్లూరు, ఏదులాపురం, తల్లాడ, నేలకొండపల్లి లకు ఒక్కో దానికి రూ.10 కోట్లు మంజూరు చేస్తున్నట్లు కేసీఆర్ తెలిపారు.
ఖమ్మం హెడ్ క్వార్టర్ లో ఉండే జర్నలిస్టులందరికీ ఇళ్ళ స్థలాలు ఇస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. ఈ బాధ్యతను ఆర్థిక మంత్రి హరీష్ రావు తీసుకోవాలని కేసీఆర్ సూచించారు. ప్రభుత్వ భూములు లేక పోతే భూములు సేకరించి జర్నలిస్టులకు ఇవ్వాలని కేసీఆర్ హరీష్ రావును ఆదేశించారు.