Telugu Global
Telangana

ఎన్నికల తర్వాత 10 వేల మందితో మేడిగడ్డ ముట్టడి

రైతులు ధైర్యంగా ఉండాలని చెప్పారు కేసీఆర్. కరీంనగర్‌ జిల్లా రూరల్‌ మండలం ముగ్ధుంపూర్‌లో ఎండిపోయిన పంటలను పరిశీలించారు, రైతులతో మాట్లాడారు.

ఎన్నికల తర్వాత 10 వేల మందితో మేడిగడ్డ ముట్టడి
X

కరీంనగర్ పర్యటనలో కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. లోక్ సభ ఎన్నికల తర్వాత 10వేలమందితో మేడిగడ్డను ముట్టడిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. పంటలకు నీళ్లివ్వకుండా ఎలా ఆపుతారో చూద్దామని అన్నారు. పోరాటానికి రైతులంతా సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. కేసీఆర్ వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ గా మారాయి. మేడిగడ్డ వ్యవహారంలో కాంగ్రెస్ కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని ఆయన ఆరోపించారు. కేవలం బీఆర్ఎస్ పై కక్షతో రైతులకు అన్యాయం చేస్తున్నారని చెప్పారాయన. కాంగ్రెస్ కి బుద్ధి చెప్పాలన్నారు. అందుకే మేడిగడ్డను ముట్టడిద్దామని పిలుపునిచ్చారు కేసీఆర్.


కరీంనగర్ పర్యటనలో బిజీబిజీ..

కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో కరువు పరిస్థితులు నెలకొన్నాయి. ప్రాజెక్ట్ ల నిర్వహణ సమర్థంగా లేకపోవడంతో సాగునీరు లేక పొలాలు ఎండిపోతున్నాయి. రైతుల కష్టాలు ప్రత్యక్షంగా చూసేందురు జిల్లాల పర్యటనకు వస్తున్న కేసీఆర్ ఇటీవల ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పర్యటించారు. "ఇది వచ్చిన కరువు కాదు, కాంగ్రెస్ తెచ్చిన కరువు" అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈరోజు కరీంనగర్ జిల్లానుంచి ఆయన మేడిగడ్డను ముట్టడిస్తామంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

రైతులు ధైర్యంగా ఉండాలని చెప్పారు కేసీఆర్. కరీంనగర్‌ జిల్లా రూరల్‌ మండలం ముగ్ధుంపూర్‌లో ఎండిపోయిన పంటలను పరిశీలించారు, రైతులతో మాట్లాడారు. ఈ సందర్భంగా రైతులు తమ నీటి కష్టాలను కేసీఆర్ కి చెప్పుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ఒత్తిడి తెద్దామని, అధైర్య పడవద్దని వారికి సూచించారు కేసీఆర్. గతేడాదికి ఇప్పటికి పరిస్థితులు పూర్తిగా తారుమారయ్యాయని అంటున్నారు రైతులు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి, శాభాష్ పల్లిలో కూడా కేసీఆర్ పర్యటించారు. శాభాష్‌పల్లి వద్ద మధ్య మానేరు జలాశయాన్ని ఆయన పరిశీలించారు.

First Published:  5 April 2024 6:14 PM IST
Next Story