వింటేజ్ కేసీఆర్.. ప్రెస్ మీట్ లో మాస్ ర్యాగింగ్
చాన్నాళ్ల తర్వాత మళ్లీ అదే వింటేజ్ కేసీఆర్ అందరికీ కనిపించారు, వినిపించారు. ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరిగిన ప్రెస్ మీట్ లో కేసీఆర్ మాటల తూటాలు పేల్చారు.
కేసీఆర్ ప్రెస్ మీట్ అంటే చాలామందికి వినేకొద్దీ వినాలనిపిస్తుంది. తిడుతున్నారని తెలిసినా ప్రత్యర్థులు కూడా ఆయన ప్రెస్ మీట్ ని ఆసక్తిగా ఉంటారు. ఆయన సెటైర్లు, హెచ్చరికలు, యాస, పడికట్టు పదాలు, ఉపమానాలు.. ఇలా అన్నీ ఓ రేంజ్ లో ఉంటాయి. చాన్నాళ్ల తర్వాత మళ్లీ అదే వింటేజ్ కేసీఆర్ అందరికీ కనిపించారు, వినిపించారు. ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరిగిన ప్రెస్ మీట్ లో కేసీఆర్ మాటల తూటాలు పేల్చారు.
Live: BRS President KCR addressing the Media at Telangana Bhavan, Rajanna Siricilla. https://t.co/Q0OgxyVHgr
— BRS Party (@BRSparty) April 5, 2024
కాంగ్రెస్ గురించి..
"కాంగ్రెస్ ప్రభుత్వమే లత్కోర్ల ప్రభుత్వం ఉన్నది. అడ్డమైన మాటలు మాట్లాడి 1.8 శాతం ఓట్లు ఎక్కువ వచ్చి గెలిచారు. మేం ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నాం. మాకు 37శాతం ఓట్లు వచ్చాయి.. మీకు 38.8 శాతం ఓట్లు వచ్చాయి. ఆ 1.8 శాతం ఓట్లు కూడా లత్కోర్ వాగ్ధానాలతో వచ్చాయి. ఉల్టా, సీదా వాగ్ధానాలతో.. తులం బంగారానికి కొందరు.. రూ.12లక్షల దళితబంధు వస్తదని కొందరు.. రూ.4వేల పెన్షన్ వస్తదని కొందరు మోసపోయారు. రూ.2లక్షల రుణమాఫీకి కొందరు మోసపోయారు. రూ.500 బోనస్ ఇస్తారని కొందరు మోసపోయారు. మహిళలకు స్కూటీ ఇస్తామని చెప్పడంతో కొందరు మోసపోయారు. బిడ్డా వారే మీకు కర్రుకాల్చి వాతపెడతరు." అని కాంగ్రెస్ కి చాకిరేవు పెట్టారు కేసీఆర్.
కాంగ్రెస్ నేతల గురించి..
"రైతుబంధు అడిగితే ఓ మంత్రి చెప్పుతో కొట్టమంటడు. రైతులను చెప్పుతో కొడుతరా? నేను ఇదివరకే చెప్పా. రైతులకు కూడా చెప్పులు ఉంటయ్. బందోబస్త్‌గా ఉంటయ్. వాళ్లకు తిక్కరేగి మర్రేస్తే మీ గతి ఏమైతదని ఆలోచించుకోండి. సిరిసిల్లలో చేనేత కార్మికులు చనిపోయే పరిస్థితి ఉంది. ఆత్మహత్యలు మళ్లీ మొదలయ్యేటట్టున్నయ్ అంటే.. ఇంకో కాంగ్రెసోడు.. ఏం పోయింది వాళ్లను నిరోధ్‌లు, పాపడాలు అమ్ముకోని బతుకమంటున్నడు. నిరోధ్‌లు అమ్ముకొని బతుకాలారా? కుక్కల కొడుకుల్లారా? మీరు మనుషులా? లక్షలాదిగా ఉండే చేనేత కార్మికుల మనోభావాలు దెబ్బతీస్తారా? ఇస్తే ఇచ్చారు.. చేతగాకపోతే ఇవ్వకండి గానీ.. నిరోధ్‌లు అమ్ముకొని, పాపడాలు అమ్ముకొని బతుకమంటే మనుషుల్లా కనిపిస్తలేరా? చేనేత కార్మికులే పులులై గర్జించి మిమ్మల్ని తరిమికొడుతరు జాగ్రత్త. బతుకమ్మ చీరల ఆర్డర్లు ఇస్తే చేనేత కార్మికులు మొన్నటి దాకా దొబ్బి తిన్నరట. దొబ్బితిన్నారంటారా దొంగనా కొడుకుల్లారా? దొబ్బితిన్నారంటారా? కార్మికులు కష్టం చేశారు. ప్రభుత్వం ఆర్డర్లు ఇస్తే నేసి ప్రజలకు పంపారు. ఏం లేని అవ్వలకు, అక్కా చెల్లెళ్లకు బతుకమ్మ చీరలు వెళ్లాయి." అని కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు కేసీఆర్.
కరెంటు కష్టాల గురించి..
"మీరు పక్కా చవటలు, దద్దమ్మలు అని అర్థమవుతున్నది. మీకు ప్రభుత్వం నడపడం చేతకాదు, తెలివి లేదు. అడ్డగోలుగా మాట్లాడుకుంటూ.. పీఆర్ స్టంట్లు పెట్టుకుంటూ.. లంగా మాటలు మాట్లాడుకుంటా.. పిచ్చిపిచ్చి కథలు చేస్తున్నరు. కరెంటు ఇవ్వ తెలివి లేదు.. చేతనైతలేదని కాంగ్రెస్ బాజాప్తా ఒప్పుకోవాలి. కరెంటు కష్టాల గురించి మీ తొత్తు పేపర్ల తప్ప.. నిజాయితీ ఉన్న అన్ని పేపర్లలో వస్తది. నిజాయితీ పేపర్లు ఏంటివో.. తొత్తు పేపర్లు ఏంటివో రేపు బయటపడుతది." అంటూ ధ్వజమెత్తారు కేసీఆర్.
"వృద్ధాప్య పింఛన్ల మీద కాంగ్రెస్ పెట్టిన ఎగనామం ప్రతి కుటుంబానికి 24వేల రూపాయలు. వాళ్లకు ఈ డబ్బు కట్టియ్యాలి. వాటిని కట్టిచ్చేదాకా వేటాడతాం. లేదంటే ఇదేనా రెఫరెండం అని వృద్ధాప్య పింఛన్లు తీసుకునేవాళ్లు కర్రుకాల్చి వాత పెట్టాలి. దీన్ని ప్రజలు రెఫరెండంగా తీసుకోవాలి. దళితులకు మోసం, రైతులకు మోసం, యాదవ సోదరులకు మోసం, కొత్త రేషన్ కార్డులు ఇస్తామని చేసిన వాగ్దానం మోసం.. మహిళలకు మహాలక్ష్మి అనే పథకం కింద నెలకు రూ.2 వేలు ఇస్తామన్నారు. అది కూడా మోసమే. వీళ్లందరికీ శఠగోపం పెట్టిండ్రు." అని కాంగ్రెస్ వైఫల్యాలను ప్రజల ముందుంచారు కేసీఆర్.