కేసీఆర్ మాస్టర్ స్ట్రోక్.. విపక్షాలకు దిమ్మ తిరుగుతోందా..?
ఎన్నికలకు దాదాపు 100 రోజుల సమయం ఉంది. అంటే అందులో కనీసం 50 రోజుల ముందు నోటిఫికేషన్ వస్తుందనుకున్నా అధికార పార్టీ బీఆర్ఎస్‌కు చేతిలో 50 రోజులు మిగిలినట్లే.
తెలంగాణలో శాసనసభ ఎన్నికలకు మూడు నెలల ముందే మొత్తం అభ్యర్థుల (నాలుగు మినహా) లిస్ట్ ప్రకటించేసి ఎన్నికల కదనరంగంలోకి దూకేశారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. ఇక అనివార్యంగా ప్రతిపక్షాలు కూడా రంగంలోకి దిగాల్సి వచ్చింది. అయితే ఇంత ముందుగానే టికెట్లు ప్రకటించడం వెనుక కేసీఆర్ మాస్టర్ మైండ్ ఉందని, ఈ దెబ్బతో విపక్షాలకు దిమ్మతిరగడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
అధికారంలో ఉండటం ప్లస్‌పాయింట్
ఎన్నికలకు దాదాపు 100 రోజుల సమయం ఉంది. అంటే అందులో కనీసం 50 రోజుల ముందు నోటిఫికేషన్ వస్తుందనుకున్నా అధికార పార్టీ బీఆర్ఎస్‌కు చేతిలో 50 రోజులు మిగిలినట్లే. ఆ 50 రోజులూ అభివృద్ధి కార్యక్రమాల పేరుతో బీఆర్ఎస్ ప్రదర్శించే స్పీడ్‌ను అందుకోవడం విపక్ష నేతలకు పెద్ద సవాల్. మరోవైపు కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్, గృహలక్ష్మి ఇంకా ఎన్నో పథకాలకు లబ్ధిదారులకు అందించడానికీ అధికార పార్టీ ఈ టైమ్‌ను చక్కగా వాడేసుకోవచ్చు.
100 రోజులు భరించడం కష్టమే..
బీఆర్ఎస్ అధికారంలో ఉంది కాబట్టి ఆ పార్టీ ఎమ్మెల్యేలకు, ఇతర అభ్యర్థులకు పరపతి ఉంటుంది. ఈ 100 రోజులూ కార్యకర్తలను మెయింటెయిన్ చేయడానికి తగిన వనరులుంటాయి. ప్రతిపక్షాలకు వచ్చేసరికి ఆశావహులందరూ క్యాడర్‌ను కాపాడుకోవడానికి డబ్బులు బాగా ఖర్చవుతాయి. ఈలోగా వాళ్లు కూడా టికెట్లు కేటాయించిన అభ్యర్థికి అయినా ఈ 100 రోజుల ఖర్చుతో ఎన్నికల ముందే సినిమా కనిపించడం ఖాయం.
*