Telugu Global
Telangana

ధైర్యంగా ఉండండి నేనున్నా.. రైతులకు కేసీఆర్ భరోసా

గతంలో నీళ్లవల్ల వరి కోత కోసేందుకు కూడా ఇబ్బందయ్యేదని, కానీ ఇప్పుడు పొలమంతా ఎండిపోయిందని మరో అన్నదాత ఆవేదన వ్యక్తం చేశాడు.

ధైర్యంగా ఉండండి నేనున్నా.. రైతులకు కేసీఆర్ భరోసా
X

రైతులు ధైర్యంగా ఉండాలని బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్ పిలుపునిచ్చారు. కరీంనగర్‌ జిల్లా ముగ్ధుంపూర్‌లో ఎండిపోయిన పంటలను ఆయన పరిశీలించారు. రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. సాగునీటికి తీవ్ర ఇబ్బంది అవుతోందని కేసీఆర్‌కు తమ బాధలు చెప్పుకున్నారు రైతులు. గతేడాది నీరు సమృద్ధిగా ఉండేది. కాలువలకు మంచిగా నీళ్లు వచ్చేవి. పంటలు బాగా పండించుకునేవాళ్లం. కానీ, ఇప్పుడు మంచినీళ్లకు కూడా గోసవుతుందని ఓ రైతు ఆవేదన వ్యక్తం చేశాడు.

గతంలో నీళ్లవల్ల వరి కోత కోసేందుకు కూడా ఇబ్బందయ్యేదని, కానీ ఇప్పుడు పొలమంతా ఎండిపోయిందని మరో అన్నదాత ఆవేదన వ్యక్తం చేశాడు. పోయిన సంవత్సరం మండుటెండల్లో కూడా చెక్‌డ్యామ్‌లు మత్తడి పోశాయని.. ఈ సంవత్సరం చుక్కా లేకుండా అడుగంటిపోయాయని మరో రైతు వాపోయాడు. ఒకసారి వాగులోకి నీళ్లిస్తే రైతులంతా బతుకుతామని కేసీఆర్‌కు చెప్పారు రైతులు. అన్నదాతల సమస్యలు విన్న కేసీఆర్‌.. బీఆర్‌ఎస్‌ అన్ని విధాలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. కాంగ్రెస్‌ వాళ్లతో ఏం కాదు. రైతులు ధైర్యంగా ఉండి పోరాటం చేయాలన్నారు.

First Published:  5 April 2024 1:52 PM GMT
Next Story