కేసీఆర్ హెల్త్ బులెటిన్ విడుదల.. రేవంత్ కీలక ఆదేశాలు
మరోవైపు తెలంగాణ ప్రభుత్వం సైతం కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీసింది. మెరుగైన వైద్యం అందించాలని యశోద వైద్యులను కోరింది.
బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హెల్త్‌కు సంబంధించిన బులెటిన్ విడుదల చేశారు యశోద వైద్యులు. బాత్‌రూంలో జారిపడడంతో ఆయన ఎడమ తుంటి ఎముక విరిగిందన్నారు. ఎర్రవల్లి ఫామ్‌హౌస్ నుంచి వెంటనే యశోద హాస్పిటల్‌కు తీసుకువచ్చినట్లు చెప్పారు. తుంటి ఎముకను మార్పిడి చేయాల్సి ఉందన్నారు వైద్యులు. ప్రస్తుతం కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వివరించారు.
కేసీఆర్ తిరిగి కోలుకునేందుకు 6 నుంచి 8 వారాలు పడుతుందని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆయన వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని బులెటిన్‌లో పేర్కొన్నారు. ఆర్థోపెడిక్, అనస్థిషియా, జనరల్ మెడిసిన్, పెయిన్ మెడిసిన్ వైద్యులు కేసీఆర్ ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తున్నట్లు చెప్పారు.
మరోవైపు తెలంగాణ ప్రభుత్వం సైతం కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీసింది. మెరుగైన వైద్యం అందించాలని యశోద వైద్యులను కోరింది. కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తుండాలని వైద్య,ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. ఆయన హెల్త్‌కు సంబంధించిన అప్డేట్స్‌ను తనకు ఎప్పటికప్పుడు అందించాలని కోరారు.