Telugu Global
Telangana

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా రాకేష్ రెడ్డి

ఈనెల 9 వరకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ కొనసాగనుంది. 10 తేదీన నామినేషన్ల పరిశీలన, 13వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఇచ్చారు. ఈనెల 27న పోలింగ్ జరగనుంది. జూన్ 5న ఓట్ల లెక్కింపు జరగనుంది.

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా రాకేష్ రెడ్డి
X

నల్గొండ, వరంగల్‌, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఏనుగుల రాకేష్‌ రెడ్డిని ఖరారు చేశారు బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్. ఈ మేరకు బీఆర్ఎస్‌ పార్టీ అధికార ప్రకటన విడుదల చేసింది. కాంగ్రెస్ పార్టీ తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్‌ను అభ్యర్థిగా ప్రకటించగా. .ఆయన ఇప్పటికే నామినేషన్ దాఖలు చేశారు.

ఈనెల 9 వరకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ కొనసాగనుంది. 10 తేదీన నామినేషన్ల పరిశీలన, 13వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఇచ్చారు. ఈనెల 27న పోలింగ్ జరగనుంది. జూన్ 5న ఓట్ల లెక్కింపు జరగనుంది.

2021 మార్చిలో వరంగల్‌, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గంలో ఎమ్మెల్సీగా ఎన్నికైన పల్లా రాజేశ్వర్ రెడ్డి.. రాజీనామా చేయడంతో ఈ స్థానానికి ఉపఎన్నిక అనివార్యమైంది. అసెంబ్లీ ఎన్నికల్లో జనగామ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు పల్లా రాజేశ్వర్ రెడ్డి.

ఇటీవ‌ల జ‌రిగిన‌ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నుంచి వరంగల్ వెస్ట్ టికెట్ ఆశించారు రాకేష్ రెడ్డి. అయితే టికెట్ దక్కకపోవడం, కమలం పార్టీ నేతల తీరుతో మనస్తాపం చెందిన రాకేష్‌ రెడ్డి బీఆర్ఎస్‌ గూటికి చేరారు. మంత్రి కేటీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్నారు.

First Published:  3 May 2024 9:01 PM IST
Next Story