గేట్స్ క్లోజ్.. పార్టీని వీడే వారికి కేసీఆర్ వార్నింగ్
ప్రస్తుతమున్న యువకులు వచ్చే ఎన్నికల నాటికి మంచి నాయకులుగా ఎదుగుతారని చెప్పారు. దీంతో ఇలా పార్టీలోకి వచ్చి, పోయే స్వార్థపరులతో అవసరం ఉండదన్నారు కేసీఆర్.
సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపక్ష నేతల కోసం పార్టీ గేట్లు ఓపెన్ చేశామని చెప్తుంటే.. పార్టీని వీడే వారు భవిష్యత్తులో మళ్లీ పార్టీలోకి రానివ్వమంటూ హెచ్చరించారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. సోమవారం R.S. ప్రవీణ్ కుమార్ చేరిక సందర్భంగా ఈ కామెంట్స్ చేశారు కేసీఆర్.
ఒక ఎంపీ, ఎమ్మెల్యే పోయినంత మాత్రానా పార్టీకి జరిగే నష్టం ఏం లేదన్నారు కేసీఆర్. ఈ ఎన్నికలతో ఎవరు మనోళ్లో.. ఎవరు పరాయి వాళ్లో.. తెలిసిపోయిందన్నారు. పార్టీని వీడి వెళ్లిన వారిని భవిష్యత్తులో మళ్లీ పార్టీలోకి రానివ్వమన్నారు.
ప్రస్తుతమున్న యువకులు వచ్చే ఎన్నికల నాటికి మంచి నాయకులుగా ఎదుగుతారని చెప్పారు. దీంతో ఇలా పార్టీలోకి వచ్చి, పోయే స్వార్థపరులతో అవసరం ఉండదన్నారు కేసీఆర్. క్రమంగా శిక్షణ తరగతులు నిర్వహిస్తామని చెప్పారు. పార్టీని పునర్‌నిర్మిస్తామని స్పష్టంచేశారు.
ఇప్పటివరకూ బీఆర్ఎస్‌కు ఐదుగురు సిట్టింగ్ ఎంపీలు సహా గ్రేటర్ పరిధిలో ఎమ్మెల్యే దానం నాగేందర్ గుడ్‌బై చెప్పారు. మాజీ ఎమ్మెల్యేలు సైతం ప్రత్యామ్యాయ దారులు వెతుక్కుంటున్నారు. ఆరూరి, సైదిరెడ్డి లాంటి నేతలు బీజేపీ కండువా కప్పుకున్నారు.